యాక్టర్‌గా మారనున్న రాఘవేంద్రరావు

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అంటే టాలీవుడ్‌లో దర్శకుడుగానే అందరికీ తెలుసు. కానీ తర్వలో ఆయన యాక్టర్‌గా కూడా మారబోతున్నారట. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన ఆయన.. అల్లు అర్జున్ లాంటి స్టార్ తరం హీరోలతో కూడా సినిమాలు తీశారు. ఇప్పటివరకు కెమెరా వెనుక యాక్షన్, కట్ చెప్పడం తప్ప సినిమాల్లో కెమెరా ముందుకు ఆయన రాలేదు.

ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చి యాక్టర్‌గా ఆయన నటించున్నారట. తనికెళ్ల భరణి చేస్తున్న ఒక సినిమాలో రాఘవేంద్రరావు లీడ్ రోల్‌లో కనిపించనున్నాడట. ఇప్పటికే కథ చెప్పగా.. నటించేందుకు రాఘవేంద్రరావు కూడా ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రాఘవేంద్రరావు స్థాయికి తగ్గట్లు హుందాగా ఈ పాత్ర ఉంటుందని తెలుస్తోంది.

వచ్చే ఏడాదిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభవుతుంని సమాచారం. మిథునం సినిమాను తెరకెక్కించిన తనికెళ్ల భరణి.. అప్పుడు మరో సినిమాతో డైరెక్టర్‌గా రాబోతున్నాడు.