అల్లు అర్జున్‌ మనసులో రాఘవేంద్రారావు స్థానం…

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్ తన తొలి చిత్ర దర్శకుడు కె. రాఘవేంద్రరావు గారిపట్ల ఎంతో గౌరవం, కృతజ్ఞతతో ఉంటాడు. తనను హీరోగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును నిత్యం తలచుకునేలా,తన సినీ ప్రయాణం ప్రారంభమైన దశను ప్రతిరోజూ గుర్తు చేసుకునేలా, అల్లు అర్జున్ తన కార్యాలయ ప్రవేశద్వారంలో రాఘవేంద్రరావు గారి ఫోటోను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆయన వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా దర్శకుడిపై తన గౌరవాన్ని చాటుకున్నారు.

అల్లు అర్జున్ కెరీర్ విజయాలమీద మాత్రమే కాకుండా, తనకు మద్దతుగా నిలిచిన వారిపట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరిచే విషయంలో కూడా ఎంతో విలువలతో ఉంటాడు. ఈ విషయంలో ఆయన వ్యక్తిత్వం కూడా ఎంతో ప్రత్యేకమైనది. రాఘవేంద్రరావు గారు తనను సినిమారంగంలోకి పరిచయం చేసిన తొలి దర్శకుడిగా, ఆయన జీవితంలో ప్రత్యేక స్థానం సంపాదించారు.

“అల్లు అర్జున్ తన కెరీర్‌ ఎదుగుదలకు తోడ్పడిన దర్శకుల విషయంలో ఎంతో జెన్యూన్‌ ప్రేమతో ఉంటాడు. వాళ్ల పట్ల ఎప్పుడూ ఆయన మనసులో ఎంతో గౌరవం ఉంటుంది. అందులో రాఘవేంద్రరావు గారు ఆయన జీవితంలో ఉన్న ప్రత్యేక స్థానం. తన దర్శకులు, సాంకేతిక నిపుణులు మరియు చిత్రబృందంలోని ఇతర సభ్యుల పట్ల అల్లు అర్జున్ గల గాఢమైన భావోద్వేగ బంధం గురించి ఆయన తరచూ మాట్లాడుతుంటారు. సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తొలిదశలో ఆయనకు సహాయపడిన వారిని ఆయన ఎప్పటికీ మరిచిపోరు అని పలువురు అంటున్నారు.

అల్లు అర్జున్ కార్యాలయం ప్రవేశద్వారంలో ఉన్న రాఘవేంద్రరావు గారి చిత్రపటం ఆయనలో ఉన్న కృతజ్ఞత, గౌరవం మరియు భావోద్వేగ సమన్వయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ విలువలే ఆయన విజయాలకు పునాది మాత్రమే కాకుండా, స్టార్‌గా కాకుండా వ్యక్తిగా కూడా ఆయనను ప్రత్యేకంగా నిలిపాయి అని సినీ పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.