`ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌` చిత్రాన్ని అభినందించిన దర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు

స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై గ‌త శుక్ర‌వారం బాక్సాఫీస్ వ‌ద్ద విడుద‌లైన న్యూ ఏజ్ థ్రిల్ల‌ర్ ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌. ప్రేక్షకులే కాదు.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకుంటోంది. రీసెంట్‌గా ఈ సినిమాను చూసిన ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు, హీరో న‌వీన్ పొలిశెట్టి, నిర్మాత రాహుల్ యాద‌వ్ న‌క్కా, ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ స‌హా ఎంటైర్ యూనిట్‌ను ప‌ర్స‌న‌ల్‌గా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌ టీమ్‌కు ఫోన్ చేశారు. అద్భుత‌మైన సినిమా చేశారంటూ ఎంటైర్ యూనిట్‌ను అభినందించారు ద‌ర్శ‌కేంద్రుడు. సినిమాకు సంబంధించిన ప‌లు విష‌యాల‌ను యూనిట్‌తో ద‌ర్శ‌కేంద్రుడు ముచ్చ‌టించారు. ఔట్‌స్టాండింగ్ మూవీ చేశార‌ని యూనిట్‌ను అభినందించారాయ‌న‌.

న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ హీరో హ‌రోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి స్వ‌రూమ్ ద‌ర్శ‌కుడు.