రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ అనగానే ప్రతి సినీ అభిమానికి మగధీర గుర్తొస్తుంది. జక్కన్న చెక్కిన ఈ సూపర్ హిట్ సినిమాని కూడా మరిపిస్తూ ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసిన మూవీ రంగస్థలం. సుకుమార్ డైరెక్షన్ లో గతేడాది రిలీజ్ అయిన రంగస్థలం, చరణ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా నాన్ బాహుబలి రికార్డులని చెరిపేస్తూ బాక్సాఫీస్ దగ్గర కొత్త చరిత్ర సృష్టించింది. చరణ్ కెరీర్ ని పూర్తి స్థాయిలో మలుపు తిప్పిన ఈ సినిమాని ఇప్పుడు తమిళ్ లో రీమేక్ చేయడానికి లారెన్స్ రెడీ అవుతున్నాడు. సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు పాత్రలో చరణ్ అద్భుతంగా నటించి మెప్పించాడు, మరి అలాంటి పాత్రలో ఎవరు నటిస్తాడు? అనే విషయం ఆలోచిస్తే… ధనుష్, కార్తీ, విజయ్ సేతుపతి లాంటి హీరోల పేర్లు లారెన్స్ లిస్ట్ లో కనిపిస్తున్నాయి. వీరిలో ధనుష్ ఇప్పటికే ఆడుకలం, అసురన్ లాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలో నటించి మెప్పించాడు.
ముఖ్యంగా అసురన్ సినిమాతో దాదాపు 200 కోట్లు రాబట్టి ధనుష్ ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచాడు. నేషనల్ అవార్డు కూడా అందుకున్న ధనుష్, రంగస్థలం లాంటి కల్ట్ సినిమాలో నటిస్తే, అనౌన్స్మెంట్ టైం నుంచే భారీ హైప్ వస్తుంది. అయితే బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ధనుష్, రంగస్థలం రీమేక్ లో ఎంత వరకూ నటిస్తాడు అనేది ఆలోచించాల్సిన విషయమే. ఒకవేళ ధనుష్ రంగస్థలం రీమేక్ ని రిజెక్ట్ చేస్తే, లారెన్స్ స్వయంగా హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కోలీవుడ్ వర్గాల సమాచారం. కాంచన సినిమాలతో డైరెక్టర్ గా, హీరోగా ప్రూవ్ చేసుకున్న లారెన్స్, రంగస్థలం సినిమాకి… చిట్టి బాబు పాత్రకి చరణ్ స్థాయిలో న్యాయం చేయగలడా? అంటే కష్టమనే చెప్పాలి. సో లారెన్స్ హీరోగా చేయాలి అనే ఆలోచన మానేసి, డైరెక్షన్ వరకూ పరిమితం అయ్యి చిట్టి బాబు పాత్రకి న్యాయం చేయగల హీరో కోసం వెతకడం బెటర్.