ప్రభాస్ ఫ్యాన్స్‌కి సూపర్ సర్‌ప్రైజ్

జిల్ ఫేమ్ రాధాకృష్ణకుమార్ డైరెక్షన్‌లో ప్రభాస్ తెరకెక్కిస్తున్న సినిమా రాధేశ్యామ్. ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా పూజాహెగ్దే నటిస్తుండగా.. పాత కాలం నాటి లవ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమాను తెరెక్కిస్తున్నారు. దీని షూటింగ్ దాదాపుగా పూర్తి అవ్వగా.. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగనున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే విడుదల అవ్వగా.. ఇవి అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1వ తేదీన టీజర్ రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ విడుదల కాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అయితే సంక్రాంతి సందర్భంగా టీజర్‌ను విడుదల చేసే అవకాశముంది. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.