వామ్మో.. ప్రభాస్ సినిమా కోసం రూ.30 కోట్లతో భారీ సెట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఇటలీలో షూటింగ్ పూర్తి చేసుకోగా.. త్వరలో హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో క్లైమాక్స్ సీన్లను తెరకెక్కించనుండగా.. దీని కోసం రూ.30 కోట్లతో భారీ సెట్ వేస్తున్నట్లు సమాచారం.

PRABHAS

సినిమాలోని కీలక సన్నివేశాలను ఈ సెట్‌లో చిత్రీకరించనున్నారు. హాలీవుడ్ మూవీ గ్లాడియేటర్‌కి యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన నిక్ పోవెల్ పర్యవేక్షణలో ఈ క్లైమాక్స్ సీన్లను తెరకెక్కించనున్నారు. ఈ క్లైమాక్స్ సీన్ సినిమాలో హైలెట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది.

కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రసీదలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.