ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న సీనియర్ హీరోయిన్

సీనియర్ హీరోయిన్ రాధిక శరత్‌కుమార్ టాలీవుడ్‌లో సీనియర్ హీరోల అందరి సరసన సినిమాలు చేసింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన ఆమె.. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలను నిర్మిస్తోంది. అయితే ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు రాజకీయాల్లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాధిక భర్త శరత్‌కుమార్ పార్టీ అయిన సమవత్తువ మక్కల్ కట్చి (ఎస్ఎంకె) పార్టీ తరపున రానున్న తమిళనాడు ఎన్నికల్లో ఆమె పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా రాధిక శరత్‌కుమార్ ఉన్నారు.

RADHIKA SARATH KUMAR MLA

శరత్‌కుమార్ మంగళవారం కోయంబత్తూరులో జరిగిన నేతల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో రాధిక శరత్‌కుమార్ ఎమ్మెల్యేగా పోటీ చేయనుందని ప్రకటించారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది తర్వాత నిర్ణయిస్తామన్నారు.