Radheshyam: ఒక్క‌సారి కాలం వెన‌క్కి వెళ్దామా.. ప్ర‌భాస్‌తో కృష్ణంరాజు!

Radheshyam: యంగ్ రెబెల్‌స్టార్ ప్ర‌భాస్ న‌టించిన తాజా చిత్రం రాధేశ్యామ్ నుంచి అప్‌డేట్ కోసం ప్రేక్ష‌కులు ఎంతాగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి పోస్ట‌ర్లు రిలీ‌జ్ చేసిన చిత్ర‌బృందం.. అలాగే ప్రేమికుల దినోత్స‌వం కానుక‌గా రాధేశ్యామ్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. దీంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ గ్లిమ్స్‌లో Radheshyamఈ చిత్రం రిలీజ్ డేట్ చేప్పేశారు చిత్ర‌బృందం.

జూలై 30న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని అధికారికంగా చిత్ర‌బృందం వెల్ల‌డించింది. కాగా తాజాగా రెబెల్‌స్టార్ కృష్ణంరాజు ఈRadheshyam చిత్ర సెట్స్‌లో దిగిన‌ ఫోటోను అభిమానుల‌తో పంచుకున్నారు. ఆ ఫోటోలో ప్ర‌భాస్‌, కృష్ణంరాజు మెడ వెనుక రెండు చేతులు పెట్టుకుని ఎంతో స్టైలిష్‌గా పైకి చూస్తూ క‌నిపించారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. అలాగే రాధేశ్యామ్ తో కాలం వెనక్కి వెళ్దాం అంటూ ఆ ఫోటోకు క్యాప్ష‌న్ రాసుకొచ్చారు కృష్ణంరాజు. ఇక ఈ Radheshyamచిత్రానికి రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా..యూవీ క్రియేష‌న్స్‌, గోపీకృష్ణ బ్యాన‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే ఈ Radheshyamచిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజాహెగ్దే హీరోయిన్‌గా న‌టిస్తుంది.