రెబల్ స్టార్ డా. యు.వి. కృష్ణంరాజు సమర్పణలో గ్లోబల్ స్టార్ ప్రభాస్, గాడ్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్ధలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో రాధే శ్యామ్ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. వంశీ, ప్రమోద్, ప్రసీధలు ఈ పాన్ ఇండియా సినిమాకు నిర్మాతలుగా వ్యవహ రిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. హిందీ వెర్షన్ కు మిథూన్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ లవ్లీ విజువల్ వండర్ ని ఏకకాలంలో ఐదు భాషల తో పాటు చైనీస్, జపనీస్ భాషల్లోనూ భారీ రేంజ్ లో విడుదల చేస్తున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలతో జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా రాధే శ్యామ్ టెక్నిసిషన్స్ డి.ఓ.పి. మనోజ్ పరమహంస, ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ ,చిత్ర దర్శకుడు రాధా కృష్ణ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ లు ప్రతి8 మీడియాతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాధా కృష్ణ కుమార్ మాట్లాడుతూ .. మా నిర్మాత కృష్ణం రాజు గారు మాకు బాగా సపోర్ట్ గా నిలిచారు. ట్రైలర్ చూసిన వారంతా ట్రైలర్ లో వి.యఫ్.ఎక్స్ బాగుంది అంటున్నారు.ఇదంతా కమల్ కన్నన్ కె దక్కుతుంది. నాకు ఇన్స్పిరేషన్ చంద్ర శేఖర్ యేలేటి,ప్రభాస్ గార్లే. ప్రభాస్ గారిని నేను ఎంతో ఇష్టపడతాను. 1970 లలో సాగే పీరియాడిక్ మూవీ, నిర్మాతలు మాకు ఏం కావాలన్న అది అందించారు. గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమా చేయడం దర్శకుడు గా గర్వంగా ఫీల్ అవుతున్నాను.చంటి గారు మాకు బ్యాక్ బోన్ గా నిలిచారు.5 బాషల్లో తీయడం అంటే గొప్ప విషయం. సంక్రాంతి శుభాకాంక్షలతో జనవరి 14 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్నారు
డి.ఓ.పి. మనోజ్ పరమహంస మాట్లాడుతూ .. చిత్ర నిర్మాతలకు ఈ స్టోరీ బాగా నచ్చిడంతో.ఈ స్క్రిప్ట్ కు ఏం కావాలో చెప్పమంటూ.. ప్రతిసీన్లో ఒక షాట్ అద్భుతంగా రావాలని నా మీద భారం పెట్టారు. ఒక్కక్క షాటే కాదు, సినిమా మొత్తం అద్భుతంగా వచ్చింది.ఈ సినిమాను అనేక దేశాల్లో చిత్రీకరించడం వలన ప్రేక్షకులకు వండర్ఫుల్ విజువల్ ఫీస్ట్ అవుతుంది. ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టూడియో ఫార్మాట్ లో గోపి క్రిష్ణ మూవీస్, యు.వి క్రియేషన్స్ తీయడం జరిగింది. రాధా గారు మోస్ట్ ఇంటలెక్చువల్ పర్సన్.ఈ మూవీ అందరికీ సంథింగ్ స్పెషల్ గా నిలుస్తోంది.. ఇటలీ లో చేసిన షూట్ కు ఇటలీ ఆర్ట్ డైరెక్టర్ తోనే వర్క్ చేశాము. ప్రతి ఫ్రెమ్ కరెక్ట్ ఉండేలా ఆర్ట్ డైరెక్టర్స్ చాలా కష్టపడ్డారు. హాలీవుడ్ లో పెద్ద సినిమాలు చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ నిక్ పాల్ మాతో 3 ఇయర్స్ జర్నీ చేయడం చాలా సంతోషం.ఈ సినిమాలోని పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.రాధే శ్యామ్ టీం లో నేను భాగం అయినందుకు గర్వాంగా ఉంది.అలాగే నాకీ అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ మాట్లాడుతూ ..రాధే శ్యామ్ బ్యూటిఫుల్ లవ్ స్టొరీ, ప్రపంచంలో ఆర్ట్స్ కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే కంట్రీ ఇటలీ.1970 లో జరిగే లవ్ స్టొరీ కి మీరు ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేయాలి అన్నారు.డి.ఓ.పి. మనోజ్ పరమహంస,మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్, దర్శకుడు రాధాకృష్ణ,వీరందరికీ మించి యు.వి క్రియేషన్స్ కు అందరికీ ఇది బిగ్ టాస్క్, ఈ ప్రాజెక్టు అనుకున్నప్పుడు మొదట ఒకలా స్టార్ట్ చేశాము,లాస్ట్ కు ఇది నెవరెండింగ్ అయిపోయింది. ఎవ్వరు కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని చేశాము ఆన్నారు
మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ మాట్లాడుతూ ..ఇంత అద్భుతమైన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది టఫ్ జాబ్ అయినా సరే నేను రీచ్ అయ్యానని అనుకుంటున్నాను అన్నారు..
నటీనటులు:
ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు,సత్యరాజ్,జగపతిబాబు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్,జయరాం, ప్రియదర్శి తదితరులు..
టెక్నికల్ టీమ్:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీధ
బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ),
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస,
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
యాక్షన్ కొరియోగ్రఫీ: నిక్ పావెల్
డైరక్టర్ ఆఫ్ కొరియోగ్రఫీ: వైభవి మర్చంట్
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
సౌండ్ ఇంజనీర్: రసూల్ పూకుట్టి
ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్
పిఆర్ఓ : ఏలూరు శ్రీను