రాజ్ తరుణ్ ‘తిరగబడరసామీ’ నుంచి రాధాభాయ్ సాంగ్ రిలీజ్  

యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సెన్సేషనల్ బ్యూటీ మన్నారా చోప్రా ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ తో పాటు ఒక స్పెషల్ సాంగ్ లో అలరించబోతుంది. తాజాగా మేకర్స్ మన్నారా పై చిత్రీకరించిన రాధాభాయ్ లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు. భోలే షావలి ఈ పాటని క్యాచి మాస్ నెంబర్ గా కంపోజ్ చేశారు. భోలే షావలి లిరిక్స్ అందించిన ఈ పాటని శ్రావణ భార్గవి హైలీ ఎనర్జిటిక్ గా ఆలపించారు. ఈ పాటలో మన్నారా చోప్రా మాస్ డ్యాన్స్ మూమెంట్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి.

యూత్ ఆకట్టుకునే రోమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తారాగణం: రాజ్ తరుణ్ , మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి

సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: ఎ ఎస్ రవికుమార్ చౌదరి
నిర్మాత: మల్కాపురం శివకుమార్
బ్యానర్: సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా
సంగీతం: జెబి &భోలే షావలి
డీవోపీ: జవహర్ రెడ్డి యం. ఎన్
ఎడిటర్: బస్వా పైడిరెడ్డి
ఆర్ట్:  రవికుమార్ గుర్రం
ఫైట్స్ – పృద్వీ, కార్తీక్
లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ, శ్రీమణి
పీఆర్వో: వంశీ శేఖర్