Raashikhanna and shahidkapoor: ఆ బాలీవుడ్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసిన రాశీఖన్నా

Raashikhanna and shahidkapoor: తెలుగులో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రాశీఖన్నా.. తమిళంలో కూడా పలు సినిమాల్లో నటించింది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు బాలీవుడ్‌లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. తాజాగా ఒక బాలీవుడ్‌ సినిమాలో ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ఒక ఓటీటీ ప్రాజెక్టులో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సరసన రాశీఖన్నా నటించనుంది.

RaashiKhanna opposite ShahidKapoor

‘వెల్ కమ్ రాశీఖన్నా.. ఈ సినిమాలో నటిస్తున్నందుకు థ్యాంక్స్’ అని షాహిద్ కపూర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. దీనిపై స్పందించిన రాశీఖన్నా.. ‘మీకు స్వాగతం. మా అన్ని సన్నివేశాల్లో మీరు సగం మాత్రమే కనిపించేలా చూస్తాను’ అని వ్యాఖ్యానించింది. రాజ్ అండ్ డీకే టీమ్ ఈ ఓటీటీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనుంది.