ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు సంబంధించిన సినిమాలు రావడం చూస్తున్నాము. అదే తరహాలో అమరావతి రైతులు చేసిన నిరసనను చూపిస్తూ రాజధాని ఫైల్స్ సినిమా వస్తుంది. అలాగె ఈరోజు ఉదయం ఈ సినిమా ట్రైలర్ విడుదల కావడం జరిగింది.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తరువాత ముఖ్య మంత్రి ప్రభుత్వాన్ని స్థాపించిన పిమ్మట రాజధాని మారుస్తాను అని ప్రకటించిన అంశం నుండి మొదలుకొని ఆ తర్వాత అమరావతి రాజధాని ప్రాంతాలలో జరిగిన సన్నివేశాలను ట్రైలర్ లో మనం చూడడం జరుగుతుంది. అలాగే రైతులు చేసిన సమ్మెలో, దీక్షలు చూపిస్తూ అదేవిధంగా రాజకీయాలు, రాజకీయ కోణాలు చూపించడం జరిగింది.
ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కొన్ని సన్నివేశాలను డైరెక్టర్ భాను చూపించినట్లు అనిపిస్తుంది. అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్, పవన్, మధు, అజయ్ రత్నం, షణ్ముఖ్ కీలకపాత్రలో కనిపించారు. తెలుగు వన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో కంటమనేని రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించడం జరిగింది.