Alluarjun: పుష్ప తొలి వీడియో.. అడ‌వుల్లోకి ప‌రుగెడుతున్న‌ పుష్ప‌రాజ్!

Alluarjun: స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో పుష్ప చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్నీకి జోడీగా ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. దీంట్లో ర‌ష్మిక గిరిజ‌న మ‌హిళా పాత్ర‌ను పోషిస్తుండ‌గా.. Alluarjun బ‌న్నీ లారీడ్రైవ‌ర్ పుష్ప‌రాజ్‌గా క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేక‌ర్స్ నిర్మిస్తుండ‌గా… పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఈ చిత్రం ఆగ‌ష్టు 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం నుంచి ఇప్పటివ‌ర‌కు ఏ అప్‌డేట్ చిత్రబృందం ప్ర‌క‌టించలేదు..

alluarjun

ఏప్రిల్ 8న బ‌న్నీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అంత‌కు ముందు రోజు అంటే ఏప్రిల్ 7న పుష్ప‌రాజ్ రివీల్ అవుతాడని ఈ రోజు ప్రీ ల్యూడ్ ఆఫ్ పుష్ప‌రాజ్ పేరుతో ఓ వీడియోను వ‌దిలారు. చేతులు వెనక్కి క‌ట్టివేయ‌బ‌డి ముఖంపై ముసుగుతో ఉన్న బ‌న్నీ ద‌ట్ట‌మైన అడ‌విలో ప‌రుగెత్తుతూ క‌నిపిస్తున్న ఈ గ్లిమ్స్ ఎంతో అల‌రిస్తోంది. దీంట్లో సినిమాటోగ్రాఫ‌ర్ మిరోస్లా కుబా బ్రోజెక్ విజువ‌ల్స్‌.. డీఎస్‌పీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇక ఈ చిత్రంలో మ‌ల‌యాళ నేచుర‌ల్ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నారు.