హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది.ప్రముఖ హీరో పునీత్ రాజ్ కుమార్(46) గుండెపోటుతో కన్నుమూశారు. శుక్ర‌వారం బెంగుళూరులో గుండెపోటుతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. శుక్ర‌వారం ఉద‌యం ఈయ‌న జిమ్ చేస్తుండ‌గా గుండె నొప్పి రావ‌డంతో ఉన్న‌ట్లుండి కింద ప‌డిపోయారు. ఆయ‌న్ని వెంట‌నే బెంగుళూరులోని విక్ర‌మ్ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. వెంటిలేట‌ర్‌పై ఉంచి ఆయ‌న‌కు వైద్యులు చికిత్స అందించారు ఐతే దురదృష్టవశాత్తు ఆయన కన్నుమూశారు. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై కూడా హాస్పిటల్ చేరుకుని పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈయ‌న 1975 మార్చి 17న జన్మించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 29 సినిమాల్లో న‌టించారు. ఈయ‌న్ని క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మలో ప‌వ‌ర్ స్టార్ అని, అప్పు అని ముద్దుగా పిలుస్తుంటారు. క‌న్న‌డ కంఠీర‌వ రాజ్ కుమార్ మూడో త‌న‌యుడు పునీత్ రాజ్‌కుమార్‌. ఐదేళ్ల వ‌య‌సులోనే ఆయ‌న సినీ రంగ ప్ర‌వేశం చేశారు. తండ్రి రాజ్ కుమార్‌తోనూ క‌లిసి న‌టించారు.