నటుడు పునీత్ రాజ్ కు కుమార్ తీవ్ర అస్వస్థత

పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆసుపత్రిలో చేరారు. అకస్మాత్తుగా ఆయనకు ఆరోగ్య సమస్య రావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

వ్యాయామశాలలో వ్యాయామం చేస్తున్నప్పుడు గుండెపోటు రావడంతో వెంటనే విక్రమ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శివరాజ్ కుమార్, అయన కూతురుతో సహా పలువురు ఆస్పత్రికి చేరుకున్నారు. నాలుగు గంటల క్రితమే శివన్న నటించిన బజరంగీ-2 చిత్రం విజయం సాధించాలని చిత్ర బృందానికి పునీత్ రాజ్‌కుమార్ శుభాకాంక్షలు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్య సమస్య మరింత పెరగడంతోఅభిమానులు విక్రమ్ ఆసుపత్రి వద్దకు చేరుకోవడంతో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీనియర్ పోలీసు అధికారులు ఆసుపత్రిని సందర్శిస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ నివాసానికి కూడా భద్రత కల్పించారు.