‘పులి’ విజువల్ వండర్.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది: ‘పులి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కె.ఎల్. దామోదర్ ప్రసాద్

సిజు విల్సన్ ప్రధాన పాత్రలో కాయాదు లోహర్ కథానాయికగా తెరకెక్కిన మలయాళం యాక్షన్ పీరియడ్ డ్రామా ‘పాథోన్‌పథం నూట్టండు’. వినయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ సీనియర్ నిర్మాత సిహెచ్. సుధాకర్ బాబు ఈ చిత్రాన్ని ‘పులి’ – The 19th Century అనే టైటిల్ తో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఎస్.కె రామచంద్రనాయక్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన తెలుగు టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మార్చి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఎల్. దామోదర్ ప్రసాద్ పులి ట్రైలర్ ని లాంచ్ చేశారు. అభినవ్ సర్దార్, సురేష్ కొండేటి తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

నిర్మాత సుధాకర్ బాబు మాట్లాడుతూ.. ‘పులి’ ట్రైలర్ ని దామోదర్ ప్రసాద్ గారు లాంచ్ చేయడం ఆనందంగా వుంది. ఇంతముండు టీజర్ లాంచ్ చేశారు. దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేసి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు చాలా అనందంగా వుంది. ఈ సినిమాని కొనడానికి చాలా కష్టపడ్డాను. చాలా హయ్యెస్ట్ రేటుపెట్టి కొన్నాను. ఈ సినిమాని చూసి ప్రసాద్ నాయక్ వాళ్ళ తండ్రిగారి పేరుతో సహా నిర్మాతగా చేరారు. మార్చి 10న సినిమాని విడుదల చేస్తున్నాం. పులి కొత్త అనుభూతిని ఇచ్చే సినిమా. పాటలు, యాక్షన్, విజువల్స్ అన్నీ అద్భుతంగా వుంటాయి. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కొత్త అనుభూతిని పొందుతారు. నేను పాతికేళ్ళుగా ఇండస్ట్రీలో వున్నాను. అయితే అమ్మ దొంగ తర్వాత మళ్ళీ అంత పెద్ద సక్సెస్ రాలేదు. ఈ సినిమాతో ఆ సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా విజయం తర్వాత నేను ప్రసాద్ నాయక్ కలసి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మీడియాతో పాటు మీ అందరి సహకారం కావాలి’’ అన్నారు.

కె.ఎల్. దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. చరిత్రలో చాలా నిజాలు దాగున్నాయి. అలా దాగున్న ఒక నిజాన్ని చూపించే చిత్రం పులి. విజువల్స్ ఎక్స్ టార్డినరీగా వున్నాయి. కేరళలో ఈ సినిమా ఘన విజయం సాధించింది. తెలుగు కూడా ఈ సినిమా అద్భుతంగా ఆడుతుందని నమ్ముతున్నాను. కొంత విరామం తర్వాత ఈ ప్రాజెక్ట్ చేస్తున్న నిర్మాత సుధాకర్ బాబు గారికి ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టాలి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ.. సుధాకర్ బాబు గారు అమ్మదొంగ, జగదీకవీరుడు లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత విజువల్ వండర్ లాంటి ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ట్రైలర్ అద్భుతంగా వుంది. కంతార, బాహుబలి స్థాయిలో తీసిన సినిమా ఇది. విజువల్ వండర్ గా వుండే సినిమాలని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు, ఈ సినిమాని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

అభినవ్ సర్దార్ మాట్లాడుతూ.. పులి టీజర్ ట్రైలర్ చూస్తుంటే విజువల్ ఫీస్ట్ లా వుంది. ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించింది. సుధాకర్ బాబు గారికి, రామచంద్రనాయక్ గారికి ఆల్ ది బెస్ట్. మలయాళంలో విజయం సాధించిన ఈ సినిమా తెలుగు కూడా పెద్ద విజయం సాధించాలి’’ అని కోరారు.

ఎస్.కె రామచంద్రనాయక్ మాట్లాడుతూ.. వాస్తవమైన కథని అద్భుతంగా చిత్రీకరించిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు,స్త్రీ మూర్తులకు గొప్ప స్ఫూర్తిని ఇచ్చే సినిమా పులి. ఇలాంటి ఉత్తమ చిత్రాన్ని మన ఉత్తమ ప్రేక్షకులకు అందించాలానే సుధాకర్ బాబు గారి ప్రయత్నం ఫలిస్తుందని, ఇందులో నన్ను కూడా సహా నిర్మాతని చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కుటుంబం అంతా కలసి చూడదగ్గ ఈ సినిమాని విజయం చేస్తారని కోరుకుంటున్నాను.

ప్రసాద్ నాయక్ మాట్లాడుతూ.. ఒక గొప్ప చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలానే మంచి ఉద్దేశంతో నిర్మాత సుధాకర్ బాబు పులి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చాలా అద్భుతమైన కంటెంట్ వండర్ విజువల్స్ వున్నచిత్రమిది. సినిమా చూసి బయటికి వచ్చిన తర్వాత ఒక మంచి గొప్ప సినిమా చుశామనే తృప్తి ప్రేక్షకుల్లో వుంటుంది. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు.

షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ఎం. జయచంద్రన్ సంగీతం అందించగా, సంతోష్ నారాయణన్ నేపధ్య సంగీతం సమకూర్చారు. వివేక్ హర్షన్ ఎడిటర్ గా, అజయ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా, మాఫియా శశి, కె. రాజశేఖర్, ఎస్.జి. సోమసుందరం ఫైట్ మాస్టర్స్ గా పని చేశారు.

తారాగణం: సిజు విల్సన్, కాయాదు లోహర్, అనూప్ మీనన్, పూనమ్ బజ్వా తదితరులు

సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం : వినయన్
తెలుగు నిర్మాత: సిహెచ్. సుధాకర్ బాబు
సహ నిర్మాత : ఎస్.కె రామచంద్రనాయక్
బ్యానర్ : ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్
సంగీతం: ఎం. జయచంద్రన్
నేపధ్య సంగీతం : సంతోష్ నారాయణన్
లిరిక్స్ : భాస్కరబట్ల
సినిమాటోగ్రఫీ: షాజీ కుమార్
ఎడిటర్ : వివేక్ హర్షన్
ఆర్ట్ డైరెక్టర్ : అజయ్ కుమార్
ఫైట్స్ : మాఫియా శశి, కె. రాజశేఖర్, ఎస్.జి. సోమసుందరం
పీఆర్వో : వంశీ-శేఖర్