మరోసారి చైతూతో పూజాహెగ్డే రోమాన్స్

పూజాహెగ్దే వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంది. టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోల అందరి సరసన సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అలా ఉండగానే అక్కినేని నాగచైతన్య సరసన పూజా మరోసారి రోమాన్స్ చేయనుంది.

pujahegde romence with chaitanya

ప్రస్తుతం మనం విక్రంకుమార్ డైరెక్షన్‌లో అక్కినేని నాగచైతన్య థ్యాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో చైతన్య సరసన హీరోయిన్‌గా పూజాహెగ్దేను తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో ఒక లైలా కోసం సినిమాలో చైతూ సరసన పూజాహెగ్డే నటించింది.