సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్

తెలుగుతో పాటు తమిళంలో పలు సినిమాల్లో నటించింది హీరోయిన్ పూజా కుమార్. కమల్ హీరోగా వచ్చిన విశ్వరూపం, ఉత్తమ విలన్ సినిమాల్లో నటించిన ఈమె.. తెలుగులో గరుడవేగ సినిమాలో కనిపించింది. విశాల్ జోషి అనే వ్యక్తిని సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు పాపకు జన్మనిచ్చింది. తాజాగా పూజా భర్త విశాల్ జోషి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించాడు. పాపకు నవ్య జోషిగా పేరు పెట్టినట్లు తెలిపాడు.

PUJA KUMAR

పూజా భర్త విశాల్ జోషి ప్రముఖ వెడ్డింగ్ ప్లాన్ కంపెనీ జాయ్ కంపెనీకి సీఈవోగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ జంట అమెరికాలో ఉంటుంది. పూజా భరతనాట్యం, కథక్, కూచిపూడిలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంది 1955లో మిస్ ఇండియా యూఎస్‌ఏ టైటిల్ సొంతం చేసుకుంది. 2000 సంవత్సరంలో కాదల్ రోజావే సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ భామ.. ఆ తర్వాత కమల్ హాసన్‌తో కలిసి ఎక్కువ సినిమాలు చేసింది.

కమల్‌తో విశ్వరూపం, విశ్వరూపం 2, ఉత్తమ విలన్ సినిమాలు చేసింది. అప్పట్లో కమల్, పూజా మధ్య లవ్ ఎఫైర్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ వాటిని పూజా కొట్టిపారేసింది. ఇక పూజా కుమార్ హిందీతో పాటు హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది.