పూజాహెగ్దేకు కరోనా పరీక్ష.. రిజల్ట్ ఏంటంటే?

హీరోయిన్ పూజాహెగ్ధే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పలు షూటింగ్‌లలో పాల్గొన్న ఈ హాట్ బ్యూటీ.. దీని కోసం విమాన ప్రయాణాలు చేసింది. దీంతో కరోనా వచ్చిందేమోననే భయంతో పూజాహెగ్దే టెస్టు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ టెస్టులో నెటిటివ్ అని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ప్రస్తుతం అనారోగ్యం బారిన పడటంతో షూటింగ్‌లకు ఈ ముద్దుగుమ్మ బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం. గత నెలలో ఇటలీలో జరిగిన రాధే శ్యామ్ షూటింగ్‌లో పూజా పాల్గొంది. ఆ తర్వాత గత కొద్దిరోజుల నుంచి అఖిల్ హీరోగా వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూటింగ్‌లో పాల్గొంది. త్వరలో మళ్లీ రాధేశ్యామ్ షూటింగ్‌లో పూజా పాల్గొనాల్సి వచ్చింది.

ఆ లోపు ఆమె అనారోగ్యం బారిన పడటంతో సినిమా యూనిట్ మల్లగుల్లాలు పడుతోంది. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా రాధేశ్యామ్ సినిమాను తెరకెక్కిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్‌ దీనికి సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న రాధే శ్యామ్‌ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.