తారక్‌కు, తనకు మధ్య మంచి కెమిస్ట్రీ ఉందన్న హాట్ బ్యూటీ

టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కొద్దిరోజుల్లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది అందాల భామ పూజాహెగ్దే. వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్న ఈ హాట్ బ్యూటీ.. స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున పక్కన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి నటిస్తోంది. అటు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా అవకాశాలు దక్కించుకుంటోంది.

గతంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో ఈ అమ్మడు నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విజయం సాధించగా.. ఆ సినిమాతో పూజాహెగ్దేకు మంచి పేరే వచ్చింది. తాజాగా ఆ సినిమా విశేషాలను పూజా పంచుకుంది. ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం చాలా బాగుందని చెప్పింది. ఎన్టీఆర్, తన మధ్య సినిమాలో కెమిస్ట్రీ చాలా బాగా పడిందని తెలిపింది.

ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం చాలా అద్భుతంగా ఉందని, తనకు అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటానని పూజా తెలిపింది. ఈ సినిమా ద్వారా తనలోని కొత్త కోణం బయటపడిందని చెప్పింది. కాగా ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాలో పూజా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.