అమిత్‌షాకు సినీ నిర్మాత లేఖ‌.. థియేట‌ర్ల‌కు 100శాతం ఆక్యుపెన్సీ ఇవ్వాల్సిందే!

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ప్ర‌ముఖ నిర్మాత‌, ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా అధ్య‌క్షుడిగా ఎంపికైన ఎస్‌. థాను ఓ లేఖ రాశారు. థియేట‌ర్లు 100శాతం ఆక్యుపెన్సీ చేయాల‌ని ఆ లేఖ‌లో కేంద్ర‌ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. క‌రోనా కార‌ణంగా సినీ ప‌రిశ్రమ కోలుకోలేని దెబ్బ‌తింద‌ని, కోలుకోవ‌డానికి సంవ‌త్స‌రాలు ప‌డుతుంద‌ని ఆయ‌న ఆ లేఖ‌లో పేర్కొన్నారు. దేశంలో అన్ని భాషలు క‌లిపి సుమారు 500 చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయ‌ని, కేంద్రం చెబుతున్న‌ట్టు 50శాతం ఆక్యుపెన్సీతో ఈ సినిమాల‌ను విడుద‌ల చేయ‌లేమ‌ని ఆయ‌న అన్నారు.

cinema theaters occupency

అలాగే బ‌స్‌, ఎయిర్‌లైన్స్ స‌ర్వీస్‌ల‌కు 100శాతం ఆక్యుపెన్సీ ఇచ్చిన కేంద్రం అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకునే థియేట‌ర్లకు 50శాతం ఆక్యుపెన్సీ చేయ‌డం ఎంత‌వ‌ర‌కు త‌గ‌ద‌ని అన్నారు. అలాకాక‌పోతే.. క‌నీసం సంక్రాంతి, లోహ్రి, రిప‌బ్లిక్‌డే సీజ‌న్‌లో అయినా 100శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్ల‌ను న‌డ‌పుకునే వెసులుబాటు క‌ల్పించాల‌ని ఎస్‌. థాను ఆ లేఖ‌లో కోరారు. ఎస్‌. థాను రాసిన లేఖ‌ను అమిత్‌షాతో పాటు కేంద్ర‌మంత్రులు ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్‌, కిష‌న్‌రెడ్డికి పంపించారు. ఇదిలా ఉంటే.. త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌మెంట్ ఇటీవ‌లే థియేట‌ర్ల‌కు 100శాతం ఆక్యుపెన్సీ చేయ‌డాన్ని కేంద్ర ప్ర‌భుత్వం తిర‌స్క‌రించిన నేప‌థ్యంలో థాను ఈ లేఖ రాయ‌డం విశేషం.