ఆర్ .ఆర్ .మూవీ మేకర్స్ ”వెంకట్” ఇక లేరు!!

ఆర్ .ఆర్ . మూవీ మేకర్స్ నిర్మాత వెంకట్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో మృతి చెందారు .


ఆయన పూర్తి పేరు జె . వి వెంకట్ ఫణింద్ర రెడ్డి . తెలుగు సినిమా రంగంలో వెంకట్ అంటే తెలియనివారు వుండరు .
వెంకట్ మూత్ర పిండ సమస్యతో ఆసుపత్రిలో చేరారు . సోమవారం ఉదయం 5. 30 గంటలకు తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు . వెంకట్ వయసు 57 సంవత్సరాలు.


తెలుగులో ది ఎండ్ , సామాన్యుడు , మాయాజాలం ,హంగామా, గుండమ్మగారి మనవడు, బహుమతి, కిక్ ,ప్రేమ కావాలి, డాన్ శ్రీను ,పైసా , ఢమరుకం, బిజినెస్ మన్ , లవ్లీ , విక్టరీ , ఇంగ్లిష్ లో డివోర్స్ ఇన్విటేషన్ చిత్రాలను నిర్మించారు .వెంకట్ ప్రతి సినిమా విడుదల సందర్భగా సేవా సంస్థలకు ఐదు లక్షల రూపాయలను అందించేవారు .సినిమా అంటే ఎంతో మక్కువ వున్న వెంకట్ ప్రచారానికి దూరంగా ఉండేవారు . ఆయన ఫోటో కూడా ఎవరికీ తెలియదు . తెరవెనుక వుండే వెంకట్ నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షించేవారు . వెంకట్ మృతికి పలువురు సంతాపం తెలిపారు .