నిరాడంబరంగా నిర్మాత ఎస్. ఎన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

సామల నర్సి రెడ్డి, తరచుగా ఎస్ ఎన్ రెడ్డి అని పిలుస్తారు. భారతీయ చలన చిత్ర నిర్మాత మరియు వ్యాపారవేత్త, పద్మజ ఫిలిమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లో ఈయన తెలుగు లో ఆడు మగాడ్రా బుజ్జి, హైదరాబాద్ లవ్ స్టోరీ, ఒక్కడుమిగిలాడు, వంటి విభిన్న చిత్రాలు నిర్మించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సినిమా రంగం లో నిర్మించుకున్నాడు. ప్రస్తుతం ఈయన నిర్మాణం లో రెండు చిత్రాలు నటనసూత్రధారి, మద్రాసి గ్యాంగ్ షూటింగ్ తుది దశలో ఉన్నాయి, ఆదివారం అయన పుట్టిన రోజు సందర్భంగా రెండు చిత్రాల యూనిట్ సభ్యులు, మరియు సినిమా వర్గాల వారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.