‘ఓదెల 2’ చిత్రం గురించి ఆశ్చర్య పరిచే సంఘటనలు బయట పెట్టిన నిర్మాత మధు

తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్ లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రలో కనిపించనున్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ అంచనాలని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. ఈ వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లలో ఒకటిగా ఏప్రిల్ 17న ఓదెల2 థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత డి మధు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.  

‘ఓదెల 2’ ప్రాజెక్ట్ ఎలా మొదలైయింది?
-ఓదెల ఫస్ట్ పార్ట్ నేను సంపత్ నందిగారికి తెలియకుండానే చూశాను. చూసి చాలా ఎక్సైట్ అయ్యాను. అనుకోకుండా సంపత్ నందిగారే ఓదెల2 కథని నాతో చెప్పడం జరిగింది. నాకు కంటెంట్ చాలా నచ్చింది. అలా ప్రాజెక్టు మొదలైంది.

మీరు సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తి?
-నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఫ్యాషన్ ఉంది. కమర్షియల్ గా కాకుండా సినిమాపై పాషన్ తోనే ఇండస్ట్రీలోకి వచ్చాను.

సంపత్ నంది గారితో మీ కొలాబరేషన్ ఎలా ఉంది?
-సంపత్ నంది గారితో నాకు మంచి వేవ్ లెంత్ కుదిరింది. భవిష్యత్తులో ఆయనతో మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని ఉంది. ఒక మంచి ప్రాజెక్టు రావాలంటే ఒక మంచి అండర్ స్టాండింగ్ ఉండాలి. అలాంటి అండర్ స్టాండింగ్ నాకు సంపత్ నందిగారికి మధ్య ఉంది.

తమన్నా గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
– తమన్నా గారు అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఫస్ట్ లుక్ తోనే ఆ క్యారెక్టర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ కథ విషయంలో తమన్నా గారు చాలా ఎక్సైట్ అయ్యారు. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఏప్రిల్ మే ఎండల్లో చెప్పులు లేకుండా షూటింగ్ చేశారు. కరెక్ట్ టైంలో కరెక్ట్ కథ ఆమె దగ్గరకు వెళ్లిందని నేను నమ్ముతున్నాను.

ప్రమోషనన్స్ ని చాలా డిఫరెంట్ ప్లాన్ చేయడానికి కారణం?
-నాకు మొదటి నుంచి ఏదైనా వెరైటీగా చేయాలని ఉంటుంది. కాశీలో ఈ సినిమాని లాంచ్ చేశాం. అలాగే మహా కుంభమేళాలో టీజర్ ని లాంచ్ చేసాం. చాలామంది అది రిస్క్ తో కూడుకున్న వర్క్ ఏమో అనుకున్నారు. అయితే ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అక్కడే సక్సెస్ ఉంటుందని ఉంటుందని నా అభిప్రాయం.  

– నేను సినిమాలపై పాషన్ తో ఇండస్ట్రీలోకి వచ్చాను. మంచి కథలు కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్టెడ్ గా చేయాలనేదే నా ప్రయత్నం.

మీరు కథ వైపు నుంచి ఏవైనా సజెషన్స్ ఇస్తారా?
-కచ్చితంగా కథ గురించి మాట్లాడుకుంటాం. చాలా డిస్కషన్స్ జరుగుతాయి. అలాంటి డిస్కషన్ జరిగాయి కాబట్టే ఈ సినిమా అంతా గ్రాండ్ గా వచ్చింది. తప్పకుండా నేను సెట్స్ కి వెళ్తాను. సినిమా అవుట్ పుట్ విషయంలో ఎక్కడ రాజీపడకుండా సినిమాని గ్రాండ్ స్కేల్ లో నిర్మించడం జరిగింది.

సూపర్ నేచురల్ పవర్స్ ఉన్నాయని మీరు నమ్ముతారా?
-నమ్మాము కాబట్టే సినిమా తీశాం( నవ్వుతూ)
-ఈ సినిమా కథ లాజికల్ గా ఉంటుంది. ప్రతి దానికి ఒక ఆధారంతోనే చూపించడం జరిగింది.  ఇందులో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆడియన్స్ ని చాలా సర్ప్రైజ్ చేస్తాయి.

మ్యూజిక్ గురించి?
-అజినీస్ లోక్నాథ్ ఈ జోనర్ కి పర్ఫెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చారు. బ్యాగ్రౌండ్ స్కోరు చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది.
-సౌందర్ రాజన్ గారు చాలా అద్భుతమైనటువంటి విజువల్స్ ఇచ్చారు.

ఈ సినిమాలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు కదా.. మీకు ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది?
-ఈ కథలో ప్రతి పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటుంది. తమన్నా గారు ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మర్. వశిష్ట గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఆ రెండు క్యారెక్టర్స్ మధ్య టగ్ అఫ్ వార్ లా  ఉంటుంది. అలాగే మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ హెబ్బా.. ఈ పాత్రలన్నీ కూడా చాలా బాగుంటాయి. ప్రేక్షకులు పాత్రలతో లీనం అయిపోతారు.

మీరు ఎలాంటి కథలు చేయడానికి ఇష్టపడతారు
-నేను ప్రతి కథలో ఎమోషన్ చూస్తాను. మంచి ఎమోషన్ అన్న కథలు తీయాలని ఉంది. నేను చేసిన పంచతంత్ర కథలల్లో కూడా ఎమోషనే ప్రధాన ఆకర్షణగా వుంటుంది. అలాగే లేడీ ఓరియంటెడ్ కథలు కూడా నాకు ఇష్టం.

గ్రాఫిక్స్ ఎలా ఉండబోతున్నాయి?
-ఇందులో గ్రాఫిక్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. పంచభూతాల కాన్సెప్ట్ ని గ్రాఫిక్స్ లో చూపించడం జరిగింది. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా బడ్జెట్ గురించి మేము ఆలోచించలేదు. ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలి ఒక మంచి సక్సెస్ ని అందుకోవాలని పాషన్ తో చేసాం.