Tollywood: కె. రాఘ‌వేంద్ర‌రావు సోద‌రుడు మృతి ప‌ట్ల మోహ‌న్‌బాబు ఆవేద‌న‌!

Tollywood: ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ కె. రాఘ‌వేంద్ర‌రావు సోద‌రుడు, నిర్మాత‌, ఆర్.కె ఫిల్మ్స్ అధినేత కృష్ణ‌మోహ‌న్ రావు క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా ఊపిరితిత్తుల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఈరోజు మ‌ధ్యాహ్నం ఫిల్మ్‌న‌గ‌ర్‌లోని త‌న నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న మృతి ప‌ట్ల ప్ర‌ముఖ సినీ న‌టుడు మోహ‌న్‌బాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా..

ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. నా సోద‌రుడు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు గారి అన్న‌గారు కృష్ణ‌మోహ‌న్ గారి మ‌ర‌ణ వార్తా విని నా మ‌న‌స్సు చ‌లించిపోయింది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుతూ ఆ కుటుంబానికి నా ప్ర‌గాఢ సంతాపాన్ని తెలియ‌జేస్తున్నాను అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు మోహ‌న్‌బాబు.