దిల్ రాజు చేతిలో బందోబస్త్

గ్యాంగ్ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనిపించిన సూర్య, ఈసారి బందోబస్త్ గా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఇప్పటికే తనకి రెండు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని ఇచ్చిన కేవీ ఆనంద్ తో కలిసిన సూర్య కాప్పాన్ సినిమా చేశాడు. ఈ సినిమానే తెలుగులో బందోబస్త్ గా విడుదల కాబోతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన బందోబస్త్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మోహన్ లాల్ కూడా ఉండడం బందోబస్త్ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికేట్ తెచ్చుకుంది. 165 నిమిషాల డ్యూరేషన్ తో కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అయినా బందోబస్త్ కి నైజాం రైట్స్ ని దిల్ రాజు కొనడంతో, ఈ సినిమాకి మంచి రిలీజ్ లభించింది. వాల్మీకీ తప్ప మరో సినిమా పోటీ లేదు కాబట్టి బందోబస్త్ మంచి టాక్ తెచ్చుకుంటే సూర్య చాలా కాలంగా ఎదురు చూస్తున్న హిట్ దొరికినట్లే.