ఎత్తు ఏంటి అంతున్నాడు…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… తెలుగు సినిమా బాక్సాఫీస్ కి రారాజు. చాలా కాలంగా టాలీవుడ్ బాక్సాఫీస్ ని ఏలుతున్న పవన్ కళ్యాణ్, రీసెంట్ గా వకీల్ సాబ్ మూవీతో సాలిడ్ కంబ్యాక్ఇచ్చాడు. ఇది కదా పవన్ కళ్యాణ్ అంటే అని ప్రూవ్ చేసిన ఈ మూవీ తర్వాత పవన్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు. ఇందులో ఒకటి మలయాళ రీమేక్ కాగా మరొకటి క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు. పిరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా అవగానే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ సినిమా చేయబోతున్నాడు. ఈ మూడు సినిమాలు అయ్యాక పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ కి ఒక మూవీ చేయబోతున్నాడు. గబ్బర్ సింగ్, తీన్ మార్ తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ ప్రాజెక్ట్ గురించి మాత్రం స్వయంగా బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశాడు. దాదాపు పవన్ కళ్యాణ్ ని ఎక్కడ ఉన్నా అక్కడ ఉండే బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. రోజూ ట్వీట్స్ చేస్తూ ఉంటాడు. అలాంటి ఒక ట్వీట్ ఈరోజు నెట్ లో హల్చల్ చేస్తుంది. అది అతని దేవుడు పవన్ కళ్యాణ్ గురించి కావడం విశేషం. నా దేవుడుతో నా హీరో అంటూ పవన్ కళ్యాణ్ తో పాటు అతని కొడుకు అకీర నందన్ కూడా ఉన్న ఫోటోని ట్వీట్ చేశాడు. ఈ ఫోటోని పవన్ అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా అకిరా ఈ పిక్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. మెగా హీరోల్లో వరుణ్ తేజ్ చాలా హయిట్. అతని మించి అకిరా నందన్ ఉండడం విశేషం. ఈ కటవుట్ కి ఒక్క మంచి సాలిడ్ సినిమా పడితే జూనియర్ పవర్ స్టార్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో టాలీవుడ్ కి స్ట్రాంగ్ గా తెలుస్తుంది. ఆ రోజు కోసం మెగా అభిమానులంతా ఎదురు చూస్తున్నారు.