ఎన్టీఆర్ బాల్ బ్యాట్మెంటన్ విజేతలకు బహుమతుల‌ ప్రదానం.

మాజీ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని సాగుతున్న వివిధ కార్యక్రమాలలో భాగంగా ఆది వారం నాడు బాల్ బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. కూకట్‌పల్లిలోని రమ్య గ్రౌండ్స్ (భగత్ సింగ్ స్పోర్ట్స్ క్లబ్) లో పోటీలను ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ సమితి ఘనంగా నిర్వహించింది. ఈ పోటీలను కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు ప్రారంభించారు. జంట నగరాలనుంచి పదిహేను జట్లు ఈ పోటీలలో పాల్గొన్నాయి. ప్రత్యేకతేమిటంటే ఈ పోటీలలో పాల్గొన్న వారంతా నడివయస్కులే కావడం విశేషం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ‌ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా వినూత్నమైన కార్యక్రమాలు నిత్యం నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీకి ముందుగా ప్రశంసలు అందించారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎన్టీఆర్ పేరు మీద స్కూల్ నిర్మాణం సాగుతోందిని వెల్లడించారు.భగత్ సింగ్ స్పోర్ట్స్ క్లబ్ క్రీడా వేధికను కూడా మరింత విస్తరించనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఎన్టీఆర్ కు సముచితమైన గౌరవం తెలంగాణ రాష్ట్రంలో లభిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ పేర్లను తొలగిస్తున్నా తెలంగాణలో మా ప్రభుత్వం వాటిని కొనసాగిస్తుందని, ఎన్టీఆర్ అంటేనే తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, తెలుగు వెలుగు పతాక అని ఎమ్మెల్యే కొనియాడారు. తెలుగు జాతి వున్నంత కాలం ఎన్టీఆర్ పేరు చిరస్మరణీయమన్నారు. సాయంత్రం వరకు సాగిన ఈ పోటీలు ఆనందోత్సాహాల మధ్య సాగాయి. మధ్యలో ఆట విడుపు కార్యక్రమాలతో పాటు, ఎన్టీఆర్ గురించి అనేక విషయాలు గుర్తు చేసుకున్నారు. విజేతలకు సాయంత్రం బహుమతుల ప్రదానం జరిగింది. ‌మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు గెల్చుకున్నవారికి,ఉత్తమ ఆట ప్రదర్శించిన వారికి ప్రత్యేక బహుమతిని తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మలప్రసన్నకుమార్,దర్శకనిర్మాత వైవిఎస్ చౌదరి బహుమతులు.అందజేశారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో ఈ విధంగా తాము పాలు పంచుకోవడం ఆనందంగా వుందన్నారు. పూర్వ జన్న సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు.‌ ఈ కార్యక్రమంలో 114 డివిజన్ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ సమితి
అధ్యక్షులు కనపర్తి రవిప్రసాద్ కార్యదర్శి తుమ్మల రమేష్,సభ్యులు మోర్ల రామకృష్ణ, భగత్ సింగ్ స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు పలువురు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.