Priyankachopra: ఆడిష‌న్స్‌లో న‌న్ను కామంగా చూశారు: ప‌్రియాంక‌చోప్రా

Priyankachopra: బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక‌చోప్రాకు సినీ కెరీర్ ప్రారంభంలో ఓ చేదు అనుభ‌వం ఎదురైంద‌ట‌. గ‌తంలోఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా బ‌హిరంగంగా తెలిపింది. ఇప్పుడు మ‌రోసారి త‌న ఆత్మ‌క‌థ అన్ ఫినిష్డ్ లో తెలిపింది. తాను ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకోవాల‌ని అందం కొల‌త‌ల్లో నిష్ప‌త్తిని స‌రిచేసుకోమ‌ని.. లైంగికంగా ప్రేరేపించేలా కూడా చేయ‌మ‌ని స‌ద‌రు ద‌ర్శ‌కుడు కోరిన‌ట్లు ఆత్మ‌క‌థ పుస్త‌కంలో వెల్ల‌డించారు.

priyanka book

ఓ సినిమా ఆడిష‌న్స్ కోసం వెళ్తే స‌ద‌రు ద‌ర్శ‌క నిర్మాత న‌న్ను నిల‌బెట్టి కామంతో చూస్తూ నాకు బూ.. కావాల‌ని పెద‌విని స‌రిచేసుకోవాల‌ని నా పిరుదుల(బ‌ట్‌) భాగం కు కొంచెంద ఎక్కువ కుష‌నింగ్ జోడించ‌మ‌ని సూచించారు. Priyankachopra నేను హీరోయిన్‌గా కావ‌లంటే నా అందాల నిష్ప‌త్తిని ప‌రిష్కారించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. లాస్ఏంజెల్స్‌లో అలా స‌రిచేయ‌గ‌ల గొప్ప వైద్యుడు తెలుస‌ని అన్నాడు. అప్ప‌టి మేనేజ‌ర్‌తో త‌న ఒప్పందాన్ని వినిపించాడు అని తెలిపారు. ఇక ఆ ప్రపోజ‌ల్స్ విన్నాక తాను అక్క‌డినుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయాన‌ని త‌ర్వాత ఆ మేనేజ‌ర్‌ని తొల‌గించాన‌ని ఆ పుస్త‌కంలో ఆ సీక్రెట్స్ తెలిపింది ప్రియాంక‌. ఇలా స్టార్ అవ్వ‌క‌ముందు ఇలాంటి అనేక సంఘ‌ట‌న‌ల‌ను ఎదుర్కొన్నాన‌ని ఆ పుస్త‌కంలో Priyankachopra ప్రియాంక పేర్కొన్నారు.