11మంది పిల్ల‌ల‌ను కంటా: ప‌్రియాంక‌చోప్రా

ప్రియాంక‌చోప్రా అన‌గానే హాలీవుడ్‌ని సైతం మెప్పించే హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. విదేశి గాయకుడు, హాలీవుడ్‌ న‌టుడు నిక్ జోన‌స్‌‌ను పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. భ‌ర్త నిక్ జోనాస్‌తో త‌న‌కున్న అనుబంధం గురించి వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను పంచుకున్నారు. ఈ నేప‌థ్యంలో తన‌కు 11మంది పిల్ల‌ల‌ను క‌నాల‌ని ఉంద‌ని ప్రియాంక‌చోప్రా అన్నారు. న‌వ్వుతూ..

వాస్త‌వానికి 11మంది ఉన్న క్రికెట్ జ‌ట్టును తాను కోరుకుంటున్నాన‌ని అన‌డంతో న‌వ్వులు కురిసాయి. కొంత‌కాలం త‌ర్వాత ఈ ఆలోచ‌నను పుర‌రాలోచిస్తే, అప్పుడు 11 చాలా ఎక్కువ కావ‌చ్చు అని నాకు అంత ఖ‌చ్చితంగా తెలియ‌దని కూడా సంభాష‌ణ‌ను కొన‌సాగించారు. అలాగే త‌న‌కు నిక్‌కి మ‌ధ్య 10సంవత్స‌రాల వ‌య‌స్సు వ్య‌త్యాసం ఉన్నా.. ఇత‌ర జంట‌ల మాదిరిగానే మేం కూడా ఒక‌రికొక‌రు సంస్కృతి ప‌రంగా విభేదాల‌ను అర్థం చేసుకున్నాం. అలాగే అవ‌తలివారు ఇష్ట‌ప‌డే వాటితో స‌ర్ధుబాటు చేసుకువాలి. మా ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌లేద‌ని ప్రియాంక‌చోప్రా పేర్కొన్నారు.