Bollywood: ప్రియాంక‌చోప్రా ఇంటిని అమ్మేస్తోంది.. ఆ ఇంట్లోకి బాలీవుడ్ హాట్ బ్యూటీ!

Bollywood: బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టి ప్రియాంక‌చోప్రా బాలీవుడ్‌ను వ‌దిలి హాలీవుడ్‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. 2018సంలో అమెరికన్ పాప్ సింగ‌ర్ నిక్‌జోనాస్ తో ప్రియాంక‌చోప్రా వివాహం చేసుకుంది. దీంతో అమెరికాకు షిఫ్ట్ అయింది ప్రియాంక‌. అలాగే తాజాగా ముంబైలోని త‌న విలాస‌వంత‌మైన ఇంటిని కూడా అమ్మేస్తుంది. రూ.7కోట్లు విలువ క‌లిగిన ఈ ఇంటికి చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి.

priyankachopra house

ప్రియాంక ఇల్లు ఎంతో విశాలంగా.. బాల్క‌నీ చాలా అద్భుతంగా ఉంటుంది. మ‌రీ ఆ ఇంటిని కొనుగోలు చేస్తున్న‌ది ఎవ‌రో తెలుసా? Bollywood బాలీవుడ్ హాట్‌ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రియాంక ఇల్లును కొనేసింది. జాక్వెలిన్ కొన్ని సంవ‌త్స‌రాల పాటు ముంబైలోని బాంద్రాలో రెంట్ ఇంట్లో ఉంటోంది. దీంతో ఒక మంచి ఇళ్లు కోసం ఎదురు చూడ‌గా.. ఈ క్ర‌మంలో ప్రియాంక ఇల్లును కొనేసింది ఈ హాట్ బ్యూటీ. ఇక జాక్వెలిన్ ప్ర‌స్తుతం సైఫ్ అలీఖాన్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టిస్తున్న Bollywood భూత్ పోలీస్ చిత్రంతో పాటు, ర‌ణ్‌వీర్‌సింగ్ న‌టిస్తున్న స‌ర్క‌స్ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌.