Priyankachopra: షూటింగ్‌ లొకేష‌న్‌లో సేఫ్ అనిపించ‌లేదు: ప్రియాంక చోప్రా

Priyankachopra: బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్ర‌స్తుతం హాలీవుడ్ ఇండ‌స్ట్రీలో స‌త్తా చాటుతుంది. ఇటీవ‌లే తాను న‌టించిన వైట్ టైగ‌ర్ సినిమా విడ‌ద‌లై.. బాక్సాఫీస్ విజ‌యం అందుకుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా నిర్వ‌హించిన‌ ఈ సినిమా స‌క్సెస్ మీట్‌లో Priyankachopra ప్రియాంక మాట్లాడుతూ.. నా త‌ల్లితండ్రులు ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించిన‌వారే.. నేను కూడా చ‌దువుల్లో రాణించి ఇంజినీర్‌గా మారాల‌ని భావించా..

కానీ అనూహ్యంగా సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టాను. నేను 2000లో ప్ర‌పంచ సుంద‌రి కిరీటాన్ని కైవ‌సం చేసుకున్నా. దీంతో సినీ ఇండ‌స్ట్రీలో ఎన్నో అవ‌కాశాలు వ‌చ్చాయి. సినిమాలో న‌టించే ప్ర‌తిభ నాలో లేదు.. కానీ షూటింగ్ లొకేష‌న్‌లోనే ప్రాక్టీస్ చేసి కెమెరా ముందుకు వ‌చ్చేదాన్ని. అయితే క‌రోనా స‌మ‌యంలో షూటింగ్స్ అన్నీ ర‌ద్దు అయిన విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్ అనంత‌రం షూటింగ్స్ నెమ్మ‌ది నెమ్మ‌దిగా షూరు చేశారు. ఈ నేప‌థ్యంలోనే తాను న‌టించిన వైట్ టైగ‌ర్ చిత్ర షూటింగ్‌లో సేఫ్‌గా ఉండ‌లేక‌పోయానంది ప్రియాంక Priyankachopra. లాక్‌డౌన్ అనంత‌రం షూటింగ్ లొకేష‌న్స్‌లో అడుగుపెట్టిన త‌ర్వాత ప‌లు జాగ్ర‌త్త‌లు పాటించాను. కానీ చిత్రీక‌ర‌ణ జ‌రిగే లొకేష‌న్స్‌ను తాను సేఫ్‌గా భావించ‌లేక‌పోయాను అని ప్రియాంక Priyankachopra చెప్పుకోచ్చారు.‌