మోడల్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన ప్రియాంక చోప్రా బాలీవుడ్ ఇండస్ట్రీలో అతికొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంది. కాలం ఎంత వేగంగా ముందుకు సాగుతున్నా కూడా మొదట్లో ఎదురైనా కష్టాలను తారలు ఎన్నటికి మరువలేరు. అదే తరహాలో ఆలోచించిన ప్రియాంక ఒక పుస్తకం ద్వారా తన జీవితం గురించి ఎదో చెప్పాలని రెడీ అవుతోంది.
తనకంటే చిన్నవాడైనా అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లాడిన ప్రియాంక పెళ్లి తరువాత కూడా తన లైఫ్ ని తనకు నచ్చినట్లుగానే మలుచుకుంది. ఆమె జీవితానికి సంబంధించిన విషయాలన్నీ చాలా మందికి తెలిసినప్పటికీ ఎవరికి తెలియని విషయాలని పుస్తకం ద్వారా తెలిజేస్తుందట. ‘అన్ఫినిష్డ్’ పేరుతో విడుదల కానున్న ఆ పుస్తకంకి సంబంధించిన ఒక ఫోటోను కూడా ఇటీవల రిలీజ్ చేశారు. దీంతో దాన్ని చదవడానికి సిద్ధంగా ఉన్నామని భర్త నిక్ జోనస్ తో పాటు ఇతర స్టార్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో, ప్రియాంక చోప్రా తన జ్ఞాపకాల ఫస్ట్ లుక్‌ను “ఫినిష్డ్” అనే క్యాప్షన్‌తో పంచుకున్నారు. తన జ్ఞాపకాలను ఆలోచనలను మొదటిసారి కాగితంపై ముద్రించినందుకు ఎంతో సంతోషంగా ఉందని.. ఇంకా అది పూర్తి కాలేదు … త్వరలో వస్తుంది! అని కామెంట్ చేశారు. ఇంతలో ఆ పోస్ట్‌పై స్పందిచిన హాలీవుడ్ నటి మిండీ కాలింగ్ తాను చదవడానికి రెడీగా ఉన్నానని చెబుతూ.. అది చాలా అద్భుతంగా ఉందని పేర్కొన్నాడు,