తరుణ్‌తో ప్రేమాయణం.. ప్రియమణి షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో హీరో తరుణ్ కూడా ఒకరు. తన వయస్సు ఉన్న హీరోలు ఇప్పటికే పెళ్లి చేసుకున్నా.. తరుణ్ మాత్రం ఇంకా బ్యాచిలర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలోనే తరుణ్ పెళ్లి చేసుకుంటాడని ఎన్నోసార్లు వార్తలొచ్చినా.. అవన్నీ అవాస్తవాలుగానే మిగిలిపోయాయి.
గతంలో ఆర్తి అగర్వాల్‌తో తరుణ్ ప్రేమయణం నడిపినట్లు పుకార్లు హాల్‌చల్ చేసిన విషయం తెలిసిందే.

PRIYAMANI

అలాగే హీరోయిన్ ప్రియమణిని కూడా తరుణ్ ప్రేమించినట్లు వార్తలొచ్చాయి ‘నవవసంతం’ సినిమాలో హీరోయిన్ ప్రియమణితో కలిసి తరుణ్ పనిచేశాడు. అప్పట్లో వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారిందని ప్రచారం జరిగింది. వారిద్దరి పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వినిపించాయి.

అప్పట్లో వచ్చిన ఈ వార్తలపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రియమణి స్పందించింది. నవవసంతం సినిమా సమయంలో తరుణ్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయని, తరుణ్ తల్లి రోజా రమణి కూడా తనను ఈ విషయం గురించి అడిగారని ప్రియమణి తాజాగా బయటపెట్టింది. తాను కూడా మీ ప్రేమను అంగీకరించినట్లు తరుణ్ తల్లి చెప్పిన మాటలను విని తాను షాక్ అయ్యానంది.

తరుణ్‌తో ప్రేమాయణం నడుపుతున్నట్లు పుకార్లు వస్తున్నట్లు ఒక జర్నలిస్ట్ తన దృష్టికి తీసుకొచ్చాడని ప్రియమణి చెప్పింది. కాగా మూడేళ్ల క్రితం ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని ప్రియమణి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.