ఆహా కొత్త క్రైమ్ థ్రిల్లర్… ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్

డెడికేటెడ్ తెలుగు ఓటీటీ ఆహా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కొంటూ మంచి వ్యూవర్షిప్ సొంతం చేసుకుంటుంది. ఇతర మల్టీలింగ్వల్ ఆన్లైన్ స్ట్రీమింగ్ సైట్స్ కి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తుంది. స్టార్ లని సినిమాలని సొంతం చేసుకుంటున్న ఆహా, ఓన్ కంటెంట్ పై కూడా కాన్సెన్ట్రేట్ చేస్తుంది. వెబ్ సిరీస్ లు చేస్తున్న ఆహా తాజాగా ప్రియదర్శితో ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ క్రైమ్ థ్రిల్లర్ చేస్తుంది. బిగ్ బాస్ ఫేమ్ నందిని రాయ్ ఫిమేల్ లీడ్ గా కనిపించనున్న ఈ సిరీస్ ని త్వరలో స్ట్రీమ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ సిరీస్ యూనిట్ పోస్టర్ బయటకి వచ్చింది. రెడ్ టింట్ లో ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ టైటిల్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. థియేటర్స్ బంద్ అయ్యాయి కాబట్టి సిరీస్ లు రిలీజ్ చేయడానికి ఇదే పర్ఫెక్ట్ టైం, మంచి టైం చూసుకోని రిలీజ్ చేస్తే బ్రేక్ ఇవ్వడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు.