సింగర్‌గా మారిన ప్రియా ప్రకాష్ వారియర్

కన్ను గీటుతో దేశవ్యాప్తంగా ఓవర్ నైట్‌లో పాపులర్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్.. కుర్రకారుని గిలి గింతలు పెట్టించింది. ‘ఒరు ఆడార్ లవ్’ సినిమాలోని ఆ ఒక్క సీన్‌తో ఈ బ్యూటీ ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్నా.. ఆ సినిమా మాత్రం ప్లాప్ అయింది. దీంతో ప్రియాకు ఇక అవకాశాలు దక్కలేదు. హిందీలో శ్రీదేవి బంగ్లా అనే సినిమాలో నటించగా.. అది ఇంకా విడుదల కాలేదు.

PRIYA PRAKASH SINGER
PRIYA PRAKASH SINGER

ప్రస్తుతం తెలుగులో నితిన్ హీరోగా వస్తున్న ‘చెక్’ అనే సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను యేలేటి చంద్రశేఖర్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో మరో రూట్‌లోకి ప్రియా ప్రకాష్ వారియర్ అడుగుపెట్టనుంది. ఒక ప్రైవేట్ ఆల్బమ్‌లో పాట పాడిందట. శ్రీచరణ్‌ పాకాల డైరెక్షన్‌లో ఓ ప్రైవేట్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ త్వరలో రానుంది. ఇందులో ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ పాట పాడిందని తెలుస్తోంది. త్వరలోనే వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసే అవకాశముంది.

హీరోయిన్‌గా అవకాశాలు రాకపోవడంతో.. ఇలా సింగర్ అవతారమెత్తిందని కొంతమంది విమర్శిస్తున్నారు. మరికొంతమంది మాత్రం తనలోని మరో టాలెంట్‌ను చూపించుకునేందుకు సింగర్ అవతారమెత్తిందని ప్రశంసలు కురిపిస్తున్నారు.