

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలపై ప్రేక్షకులకు ఎప్పుడూ క్యూరియాసిటీ ఉంటుంది. అలా ఓ గ్రామీణ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మూవీ ‘ప్రేమకు జై’. అనిల్ బురగాని, జ్వలిత జంటగా, శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో అనసూర్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల (ఏప్రిల్) 11న (శుక్రవారం) థియేటర్‌లలో విడుదల అవుతోంది. ఈ వైవిద్యమైన ప్రేమ కథ చిత్రం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు తెరపై చూడని ఓ లవ్‌స్టోరీని చూపించబోతున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ప్రచార చిత్రాలు ఇప్పటికే వైరల్‌గా మారాయి.
ఈ సందర్భంగా ‘ప్రేమకు జై’ దర్శకుడు మల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ… ”పల్లెటూరి నేపథ్యంలో వాస్తవంగా జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం. మా హీరో హీరోయిన్లు అనిల్ బురగాని, జ్వలిత బాగా చేశారు. మా టీం అందరి కృషి వల్ల ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. క్వాలిటీ విషయంలో నిర్మాత రాజీ పడలేదు. ఎంతో సహకరించారు. శుక్రవారం థియేటర్‌లలో విడుదలయ్యే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం” అని అన్నారు.
అనిల్ బురగాని, ఆర్ జ్వలిత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో దుబ్బాక భాస్కర్ విలన్. ఈ చిత్రానికి ఎడిటర్: సామ్రాట్, సినిమాటోగ్రాఫర్: ఉరుకుందా రెడ్డి, సంగీతం: చైతు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం రాజేష్, సహ నిర్మాత: మైలారం రాజు, నిర్మాత: అనసూర్య, కథ – దర్శకత్వం: శ్రీనివాస్ మల్లం.