షూటింగ్ కార్యక్రమాలు పూర్తికొన్న “ప్రేమదేశపు యువరాణి”.

A.G.E క్రియేషన్స్, S2H2 ఎంటెర్టైమెంట్స్ పతాకంపై యామిన్ రాజ్ ,కార్తీక్ జయంత్, ప్రియాంక రెవరి నటీనటులుగా సాయి సునీల్ నిమ్మల దర్శకత్వం లో ఆనంద్ వేమూరి, హరి ప్రసాద్. సిహేచ్ లు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం “ప్రేమదేశపు యువరాణి”. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బుచ్చి నాయుడు కండ్రిగ చిత్ర నిర్మాత పి శ్రీనివాస్ రావు, నిర్మాత బ్రదర్ ప్రతాప్,స్నేహితుడు చంద్ర తదితరులు పాల్గొన్నారు .

చిత్ర నిర్మాతలు వేమూరి ఆనంద్, హరి ప్రసాద్. సిహేచ్ మాట్లాడుతూ..మాకు A.G.E అనే అవుట్ డోర్ యూనిట్ ఉంది.ఈ యూనిట్ పేరుతోనే A.G.E క్రియేషన్స్ బ్యానర్ ను స్థాపించి సినిమా తీద్దాము అని మంచి కథల కోసం చూస్తున్న సమయములో దర్శకుడు సాయి సునీల్ లవ్ కామెడీ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ తో సాగె రివేంజ్ స్టోరీ నాకు చెప్పగానే నచ్చడంతో నా సన్నిహితుడు హరి తో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను.ఇందులో అద్భుతమైన ఐదు పాటలు, మూడు ఫైట్స్ ప్రేక్షకులను అలరిస్తాయి.ఈ సినిమాకు నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ సహకరించడంతో సినిమా బాగా వచ్చింది. ఈనెల 20 కి ఫస్ట్ కాపీ రెడీ చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని అన్నారు..

దర్శకుడు సాయి సునీల్ నిమ్మల మాట్లాడుతూ..ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదములు. ఈ స్క్రిప్టు మొదలు పెట్టినప్పటి నుండి “ప్రేమదేశపు యువరాణి” టైటిల్ కు సంబంధించి ఫ్రెండ్స్ నుండే కాకుండా చాలామంది నుంచి మంచి అప్లాజ్ వస్తోంది.చాలా లొకేషన్స్ లో ఈ సినిమా షూట్ చేయడం జరిగింది నటీనటులు టెక్నిషియన్స్ అందరూ చాలా చక్కగా కుదిరారు.ఈ చిత్రం ద్వారా యామిన్ రాజ్ హీరోగా పరిచయమవుతున్నాడు. తను రవితేజ, నాని లా న్యాచురల్ యాక్టింగ్ చేశాడు. అలాగే తనతో నటించిన కార్తీక్ జయంత్ కు కూడా మొదటి సినిమా అయినా రెండు మూడు సినిమాలు చేసిన వాడిలా ఈజీగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ ప్రియాంక రెవరీ ‘హర్యానా’ అమ్మాయి అయినా చాలా చక్కగా నటించింది.ఈ సినిమా మొత్తం హీరోయిన్ చుట్టే రన్ అవుతుంది. చాలా అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేసింది. అందరూ “ప్రేమ దేశపు యువరాణి” అంటే ఒక సాఫ్ట్ ఫీల్ గుడ్ లవ్ స్టోరి అనుకుంటారు. కానీ ఇందులో లవ్ కామెడీ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు చాలా థ్రిల్ ఫీల్ అవుతాడు. ఈ సినిమాలో స్విచ్వేషన్ పరంగా కామెడీ వస్తుంది.ఇందులో నటించిన వారందరూ కొత్తవారయినా కూడా చాలా చక్కగా నటించారు. శివ కుమార్ దేవరకొండ కెమెరా పని తీరు అద్భుదతంగా వుంది ,ఆర్. పి పట్నాయక్ గారు తమ్ముడు అజయ్ పట్నాయక్ అందించిన మ్యూజిక్ చాలా వినసొంపుగా ఉంటుంది . కాసర్ల శ్యామ్ గారి లిరిక్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. నెక్స్ట్ వీక్ లో మోషన్ పోస్టర్ రిలీజ్ చేసుకొని ఆ తర్వాత టీజర్ రిలీజ్ చేసుకొని ఈ నెల చివరి వారంలో ఆడియో విడుదల చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాము అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో యామిన్ రాజ్ ,కార్తీక్ జయంత్, ప్రియాంక రెవరి , యోగి, రాజా రెడ్డి, సందీప్, పవన్ తదితరులు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు తెలిపారు

నటీనటులు
యామిన్ రాజ్ ,కార్తీక్ జయంత్, ప్రియాంక రెవరి , సందీప్, (విలన్ ),రాజారెడ్డి, పవన్,యోగి కత్రి, శ్రవంతి, సునీత, ఇంటింటి గృహలక్ష్మి ఫెమ్ హరికృష్ణ, సాయి, బండ సాయి, భాష, సారిక, గణేష్ తదితరులు …

సాంకేతిక నిపుణులు
బ్యానర్స్ : A.G.E క్రియేషన్స్, S2H2 ఎంటర్టైన్మెంట్స్ .
నిర్మాత : ఆనంద్ వేమూరి, హరి ప్రసాద్.సిహేచ్
రైటర్ అండ్ డైరెక్టర్ : సాయి సునీల్ నిమ్మల
సినిమాటోగ్రాఫర్ : శివకుమార్ దేవరకొండ
మ్యూజిక్ :అజయ్ పట్నాయక్
లిరిక్స్ : కాసర్ల శ్యామ్
ఆర్ట్ డైరెక్టర్ : నాయుడు రాజు
సౌండ్ ఎఫెక్ట్ : పురుషోత్తం రాజు
ఫైట్ మాస్టర్ : శివరాజ్ మాస్టర్
డాన్స్ మాస్టర్స్ : కపిల్ మాస్టర్, శ్రీవీర్ మాస్టర్
కాస్ట్యూమ్ డిజైనర్ : మహి
ఎడిటర్ : యం ఆర్.వర్మ
పి. ఆర్. ఓ : బాబు నాయక్