ప్రశాంత్ వర్మ పివిసియు నుండి ‘జై హనుమాన్’ ఎప్పుడంటే….

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా జాతీయ స్థాయిలో ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ ప్రకటించారు. ఇప్పుడు ఆ యూనివర్సిటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా జై హనుమాన్. హనుమాన్ సినిమా భారీ విజయం సాధించడంతో ప్రేక్షకులకు జై హనుమాన్ పైన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే అడ్వాన్స్ సినిమాలోని హనుమంతుడు ఎవరు చేశారో దర్శకుడు బయటకు చెప్పలేదు. అయినప్పటికీ హనుమాన్ లోని హనుమంతుడు కొంతమంది దగ్గుబాటి రానా చేశారని అలాగే మరి కొంతమంది మెగాస్టార్ చిరంజీవి గారు చేశారని అంటున్నారు. కానీ ఇంతవరకు సినిమా టీం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఆ రోల్ ఎవరు చేశారో అనేది నిర్ధారించలేకపోతున్నారు.

ఇది ఇలా ఉండగా హనుమాన్ సినిమా నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నుండి మరో సినిమా రాబోతుంది. ప్రియదర్శి, నబ్బా నటేష్ ప్రధాన పాత్రలుగా డార్లింగ్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు అశ్విన్ రామ్ ప్రసగతం చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్లో భాగంగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ నుండి శ్రీమతి చైతన్య రెడ్డి గారు మీడియా వారితో సమావేశం కావడం జరిగింది.

ఈ సమావేశంలో జై హనుమాన్ కు సంబంధించి కొన్ని కీలక అంశాలు కూడా బయటకు చెప్పడం జరిగింది. అయితే హనుమంతుడు క్యారెక్టర్ ఎవరు చేయబోతున్నారు అని మీడియా వారు అడగగా దానికి సమాధానం గా ఇప్పటికైతే ఎవరిని అనుకోలేదు కానీ హనుమంతుడుగా చిరంజీవి గారు, లేదా రామ్ చరణ్ గారు చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా, వారిద్దరిలో ఒకటి చేస్తే బాగుంటుంది అని నా పర్సనల్ ఒపీనియన్ అంటూ చైతన్య రెడ్డి గారు సమాధానం ఇచ్చారు. అలాగే జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలైనట్లుగా ఆమె తెలిపారు. జై హనుమాన్ సినిమా సంక్రాంతికి అవకాశం ఉందా అని సంక్రాంతికి విడుదల కావడం కష్టమే ఉన్నట్లుగా తన సమాధానం ఇచ్చారు. అలాగే ఇంకొక సంబంధించి అప్డేట్ త్వరలోనే ఇస్తామని అన్నారు. అయితే ఈ సంక్రాంతి అయితే జై హనుమాన్ సినిమా రావడంలేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.