భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇన్ని రోజుకు వైద్యుల సమక్షంలోనే చికిత్స తీసుకుంటున్నప్పటికి ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఏ మాత్రం మార్పు కనిపించలేదు. చాలా రోజులుగా కోమాలోనే ఉన్న ప్రణబ్ కొద్దీ సేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రణబ్ తనయుడు అభిజిత్ ముఖర్జీ అధికారికంగా తెలియజేశారు
ప్రణబ్ ముఖర్జీ మొదట మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆసుపత్రిపాలయ్యారు. అనంతరం ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని వచ్చింది. ఆ తరువాత ఊపిరితిత్తులకు కూడా ఇన్ఫెక్షన్ సోకింది. అప్పటి నుంచి ఆయన కోమాలోనే ఉన్నారు. దేశవ్యాప్తంగా పూజలు, ప్రార్థనలు నిర్వహించినా ఫలితం దక్కలేదని తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ప్రణబ్ తనయుడు వివరణ ఇచ్చారు. అదే విధంగా ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి వైద్యులు శ్రమపడినా ఫలితం దక్కలేదని, అభిజిత్ ట్విట్టర్ లో పెర్కిన్నారు. ప్రణబ్ మృతి పట్ల ప్రధాని మోదీ అలాగే సీనియర్ రాజకీయ నాయకులు, ప్రముకులు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.