పవన్ ఒక ఊసరవెల్లి.. సీనియర్ నటుడు సంచలన వ్యాఖ్యలు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవన్ ఒక ఊసరవెల్లి అని ఒక ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2014లో బీజేపీకి మద్దతిచ్చిన పవన్.. 2019లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశాడు. ఇప్పుడు మళ్లీ బీజేపీకి మద్దతు ఇస్తున్నాడు. ఇలా మూడుసార్లు మారుతున్నారంటే.. మీరు ఊసరవెల్లి అయి ఉండాలి కాదా అని ప్రకాశ్‌రాజ్ విమర్శించాడు.

pawankalyan

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన పవన్.. ఆ తర్వాత తప్పుకుని బీజేపీకి ఓటేయ్యాలని చెబితే ఇక జనసేన ఎందుకని ప్రకాశ్‌రాజ్ ప్రశ్నించాడు. పవన్ పూటకో మార్చే ఊసరవెల్లి అని దీని ద్వారా తెలుస్తుందన్నాడు. జాతిహితం కోసం బీజేపీకి మద్దతు అంటే ఇక జనసేన పార్టీ ఎందుకన్నాడు. ఇంకొకరి భుజాన ఎక్కి ఈ రాజకీయాలు ఎందుకు అని ప్రకాశ్‌రాజ్ ఫైర్ అయ్యాడు.

బీజేపీ వాళ్లు దారుణంగా మాట్లాడుతున్నారని, హైదరాబాద్‌లో అల్లకల్లోలం సృష్టిస్తున్నారని ప్రకాశ్ రాజ్ ఆరోపించాడు. పవన్ కల్యాణ్‌కు ఏమైందో నిజంగా నాకు అర్థం కావట్లేదని, పవన్ నిర్ణయాలపై చాలా డిసప్పాయింట్ అయ్యాయన్నాడు. నువ్వొక లీడర్.. మీకొక పార్టీ ఉంది. మళ్లీ ఇంకో నాయకుడివైపు వేలు చూపించడం ఏంటీ అని ప్రకాశ్ రాజ్ ఫైర్ అయ్యాడు. ‘ఏపీలో లేదా ఇంకోచోట జనసేన ఓట్ షేర్ ఎంత?.. బీజేపీ ఓటు షేర్ ఏంటి?..2014లో మీరే బీజేపీ వాళ్లు అద్భుతం ఇంద్రుడు, చంద్రుడు అన్నారు. మళ్లీ గత ఎన్నికల్లో లేదు వాళ్లు ద్రోహులు అన్నారు. మళ్లీ ఇప్పుడు నాయకులుగా కనిపిస్తున్నారని అంటున్నారు. ఇదేంటి పవన్? అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించాడు.