త్వరలో ప్రదీప్ హీరోగా మరో సినిమా

బుల్లితెరపై తన కామెడీ, సెటైర్లతో యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న ప్రదీప్… ఇప్పుడు పెద్ద తెరపై హీరోగా కూడా సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రదీప్ హీరోగా నటించిన ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమా శుక్రవారం విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను అందుకుంది. సినిమాలో తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను ప్రదీప్ అలరించగా.. సినిమాలోని సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి.

pradeep second movie

అయితే తొలి సినిమా విడుదల కావడంతో… వెంటనే రెండో సినిమాకి ప్రదీప్ లైన్లో పెట్టాడు. త్వరలో ప్రదీప్ హీరోగా మరో సినిమా రానుంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రదీప్ ప్రకటించాడు. త్వరలోనే తన రెండో సినిమా గురించి ప్రకటిస్తానని, ప్రస్తుతం మొదటి సినిమా ఫలితాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పాడు. మొదటి సినిమా కోసం చాలా కష్టపడ్డానని ప్రదీప్ చెప్పుకొచ్చాడు.