ప్రదీప్ రంగనాథన్ బైలింగ్వల్ #PR04 గ్రాండ్ గా లాంచ్  

ప్రదీప్ రంగనాథన్ తను దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ ‘లవ్ టుడే’తో నటుడిగా అరంగేట్రం చేసాడు, ఆ తర్వాత తమిళం, తెలుగు రెండింటిలోనూ విజయం సాధించిన తన రీసెంట్ హిట్ ‘డ్రాగన్’ తో మ్యాసీవ్ పాపులరిటీ సాదించారు. వరుస విజయాలతో, ప్రదీప్ రంగనాథన్ తమిళ సినిమాల్లోనే కాకుండా తెలుగులో కూడా పేరు తెచ్చుకున్నాడు. పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా తమిళం-తెలుగు ద్విభాషా ప్రాజెక్టును అనౌన్స్ చేసింది. గతంలో అనేక సక్సెస్ ఫుల్ ప్రాజెక్టులకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కీర్తిశ్వరన్ ఈ చిత్రం డైరెక్టర్ పరిచయం కానున్నారు. 

#PR04 చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు వేడుకలోని ఫస్ట్ విజువల్స్ ప్రదీప్ రంగనాథన్ నటించిన ఆసక్తికరమైన సన్నివేశాన్ని రివిల్ చేశాయి, ఇది ఒక ఇంటెన్స్ లో ప్రారంభమై, ఒక ఫన్ ఫుల్ కిస్ తో ముగుస్తుంది, ఇది న్యూ ఏజ్ కథాంశంతో కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. 

‘ప్రేమలు’ చిత్రంతో అందరినీ అలరించిన మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుండగా, సీనియర్ నటుడు శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు.

మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ ని ఎంపిక చేసింది. ఈ చిత్రానికి సంగీతం యంగ్ సెన్సేషన్ సాయి అభ్యాంకర్ మ్యూజిక్ అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. లతా నాయుడు ప్రొడక్షన్ డిజైనర్‌గా, భరత్ విక్రమన్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. 

ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

తారాగణం: ప్రదీప్ రంగనాథన్, శరత్ కుమార్, మమిత బైజు, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం  

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం:  కీర్తిశ్వరన్

నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్

CEO: చెర్రీ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనిల్ యెర్నేని

సంగీతం: సాయి అభ్యంక‌ర్

సినిమాటోగ్రాఫర్: నికేత్ బొమ్మి

ప్రొడక్షన్ డిజైనర్: లతా నాయుడు

కాస్ట్యూమ్ డిజైనర్: పూర్ణిమా రామస్వామి

ఎడిటర్: బరత్ విక్రమన్

తమిళ PRO: సురేష్ చంద్ర, సతీష్

తెలుగు PRO: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో