Prabhudeva: తొలిసారి ప్ర‌భుదేవాతో కాజ‌ల్ అగ‌ర్వాల్ సినిమా..

Prabhudeva: ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ ప్ర‌భుదేవా.. హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో ఓ త‌మిళ చిత్రంలో జ‌త క‌ట్ట‌నున్నాడు. ఈ రొమాంటిక్ కామ‌డీ చిత్రాన్ని త‌మిళ డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ తెర‌కెక్కిస్తార‌ట‌. పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఇక కాజ‌ల్ ఇటీవ‌లే వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లుతో వివాహం జ‌రిగిన విష‌యం తెలిసిందే. పెళ్లి త‌ర్వాత కూడా ఆమె సినిమాల‌కు ఓకే చెపుతూ త‌న కెరీర్‌ను కొన‌సాగిస్తోంది. ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు కూడా ఆమెకు ఆఫ‌ర్లు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు.

తాజాగా Prabhudeva ప్ర‌భుదేవాతో క‌లిసి కాజ‌ల్.. క‌ళ్యాణ్ డైరెక్ష‌న్‌లో ఓ త‌మిళ చిత్రం చేయ‌బోతుంద‌ని అందిన స‌మాచారం. ఇదిలా ఉంటే కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న ఆచార్య చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అలాగే ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ ఆచార్య చిత్రానికి సంగీతం స‌మ‌కురుస్తున్నారు.