సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ప్రభాస్ “సాహో ” స్ట‌న్నింగ్ యాక్షన్ పోస్టర్…

బాహుబలి చిత్రం తరువాత యంగ్‌ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ సాహో. ఇటీవలే  ప్ర‌భాస్ సోష‌ల్ మీడియాలో వున్న రెబల్‌స్టార్ ఫ్యాన్స్ మ‌రియు ఇండియ‌న్ మూవీ ల‌వ‌ర్స్ కొసం సాహో రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు మరింత హీట్ ను పెంచేసే విధంగా ఉన్న స్టన్నింగ్ యాక్షన్ ప్యాక్ డ్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ స్టన్నింగ్ యాక్షన్ పోస్టర్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్స్ లో కొనసాగుతోంది. ఈ పోస్టర్ తో సినిమా ఎంత స్టైలిష్ యాక్షన్ తో కూడుకున్నదో అర్థమవుతోంది. పోస్టర్ డిజైనింగ్ కూడా వరల్డ్ క్లాస్ క్వాలిటీని తలపించింది. దీంతో ఈ సినిమా క్వాలిటీ ఏ రేంజ్ లో ఉండనుందో అర్థమైంది. హీరోయిన్ శ్ర‌ధ్ధా క‌పూర్ సైతం ఈ పోస్టర్ లో ప్రభాస్ కి పర్ ఫెక్ట్ కాంబినేషన్ గా కనిపించింది.  ఈ పోస్టర్ బయటికి వచ్చిన తర్వాత  డైహ‌ర్ట్ ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేవు. 


ఈ చిత్రం ఇండియాలో  మొట్ట‌మెద‌టి సారిగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీ తో తెరెకెక్కుతోంది. ఈ చిత్రం అగ‌ష్టు 30న భారీ అంచనాలతో అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి లాంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రం త‌రువాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో రెబ‌ల్‌స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ అంద‌రూ ఈ సినిమా పై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. దీంతో మేక‌ర్స్ ఎక్క‌డా చిన్న విష‌యం లో కూడా కాంప్ర‌మైజ్ కాకుండా ఆడియ‌న్స్ కి పూర్తి వినోదాన్ని క్లారిటి ఆఫ్ క్వాలిటీ తో అందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. 

యువి క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్ర‌మ్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రన్ రాజా రన్ ఫేం సుజీత్ ఈ భారీ చిత్రానికి దర్శకుడు.  

న‌టీన‌టులు.. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్, శ్రధ్ధాక‌పూర్‌, జాకీష‌ర‌ఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌కాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ‌, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేఖ‌ర్‌, టిను ఆనంద్‌, శ‌ర‌త్ లోహిత‌ష్వా త‌దిత‌రులు..