ప్రభాస్ బయటకి రావాల్సిందే…

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహూ సినిమా జోష్ ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. వీకెండ్ అయిపోయే వర్కింగ్ డేస్ మొదలవ్వడంతో కాస్త డ్రాప్ కనిపించినా కూడా సాహూ సినిమా వసూళ్ల పరంపర కొనసాగిస్తూనే ఉంది. ముఖ్యంగా నార్త్ తో సాహూ హవా కొనసాగుతూనే ఉంది, వద్దన్న చోటే వసూళ్లు రాబడుతున్న ప్రభాస్ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాలకన్నా ధీటుగా గుజరాత్, బీహారు, యూపీ లాంటి రాష్ట్రాల్లో సాహూకి రిపీటెడ్ ఆడియన్స్ వస్తున్నారు. సాహూ సినిమా ఐదో రోజు ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల గ్రాస్ రాబడితే అందులో సగం బాలీవుడ్ నుంచే రావడం విశేషం.

మంగళవారం 9.10 కోట్లు రాబట్టిన సాహూ, మొత్తంగా ఐదు రోజులకు 102 కోట్ల వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇదే జోష్ కొనసాగితే మరో రెండు రోజుల్లో సాహూ సినిమా నార్త్ లో బ్రేక్ ఈవెన్ చేరిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. నెగటివ్ రివ్యూస్ తో కూడా వారం తిరిగే సేఫ్ జోన్ లోకి రావడం అంటే మాటలు కాదు, ఈ ఫీట్ సాధిస్తే ప్రభాస్ ఫాలోయింగ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రీ-రిలీజ్ ప్రొమోషన్స్ ని సూపర్ గా చేసిన ప్రభాస్, అదే రేంజులో పోస్ట్ రిలీజ్ ప్రొమోషన్స్ కూడా చేస్తే సాహూ సినిమా తెలుగులో కూడా మరింత ఊపందుకుంటుంది. రీసెంట్ గా రెస్ట్ మోడ్ లో నుంచి బయటకి వచ్చిన ప్రభాస్, పోస్ట్ రిలీజ్ ప్రొమోషన్స్ ఎప్పుడు మొదలు పెడతాడో చూడాలి.