ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ప్రభాస్ నుంచి మరో ఇండియన్ బిగెస్ట్ పాన్ ఇండియా మూవీ రానున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఓం రావత్ దర్శకత్వంలో ప్రభాస్ 22వ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు పోస్టర్ చూస్తేనే అర్ధమవుతోంది. సినిమా 3డి లో రూపొందించనున్నట్లు కూడా టాక్ వస్తోంది.
ఇక ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ పై తన వివరణ ఇచ్చారు. ప్రతి ఒక్క పాత్రను డిజైన్ చేసుకున్న విధానం అద్భుతంగా ఉంది. ఇలాంటి పాత్రలో నటిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. అలాగే ఛాలెంజింగ్ గా కూడా ఉంది. ఇది ఒక బాధ్యతతో కూడుకున్న ప్రాజెక్టు. ఇలాంటి పాత్రలో నటించడానికి నేను చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను. దర్శకుడు ఓం రావత్ డిజైన్ చేసిన విధానం చాలా బావుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని తాను భావిస్తున్నట్లు ప్రభాస్ వివరణ ఇచ్చారు. ఇక ఈ సినిమా పనులను 2021లో మొదలుపెట్టి 2022లో సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది