సమంతకి షాక్.. నో చెప్పిన ప్రభాస్

ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు ఆహా యాప్‌ కోసం శామ్ జామ్‌ షో టాక్ షోను హీరోయిన్ సమంత చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీనియర్ హీరో రానా దగ్గుబాటి, యంగ్ హీరో విజయ్ దేవరకొండతో చేసిన ఇంటర్వ్యూలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. త్వరలో మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఇంటర్వ్యూ ఆహా యాప్‌లో స్ట్రీమింగ్ కానుంది. త్వరలో తమన్నా, అల్లు అర్జున్‌లతో కూడా స్యామ్ ఇంటర్వ్యూ చేయనుంది. ఈ షోకు కోసం సమంత ఏకంగా కోటి 80 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

samantha

అయితే ఆ షోకు రావాల్సిందిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను సమంత కోరినట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం షూటింగ్‌లలో బిజీగా ఉండటంతో ఈ షోకు వచ్చేందుకు ప్రభాస్ నో చెప్పాడట. దీంతో సమంత షాక్‌కు గురైనట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ప్రభాస్ ఖచ్చితంగా ఇంటర్వ్యూకు వస్తాడని సమంత భావించిందట. కానీ ప్రభాస్ నో చెప్పడంతో సమంత నిరాశకు గురైందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రభాస్ వరుస షూటింగ్‌లతో బిజీగా ఉండటంతో.. షోకు రావడానికి అసలు కుదరదని చెప్పేశాడట.

ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా చేస్తుండగా.. దీని తర్వాత పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్‌లో నటించనున్నాడు దీని తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న మరో పాన్ ఇండియ సినిమాలో ప్రభాస్ సినిమా చేయనున్నాడు. ఇలా వరుసగా ప్రభాస్ చేతిలో సినిమాలు ఉన్నాయి.