Prabhas: బొగ్గు గ‌నిలో మాసిపోయిన బ‌ట్ట‌ల‌తో ప్ర‌భాస్‌..

Prabhas: యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌- కేజీఎఫ్ ఫేం ప్రశాంత్‌నీల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం స‌లార్‌. ఈ చిత్రం ఫ‌స్ట్ షెడ్యూల్‌లో ఓపెన్ కాస్ట్ సింగ‌రేణి బొగ్గు గ‌నుల్లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను 10రోజుల పాటు షూటింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భాస్ ఇవాళ షూటింగ్ లొకేష‌న్‌లో అడుగుపెట్టె ముందు రామ‌గుండం సీపీని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.. అనంత‌రం లొకేష‌న్‌లో కనిపించిన ప్ర‌భాస్‌Prabhas.. సింగ‌రేణి బొగ్గు గ‌నుల్లో కార్మికులు ఎలా ఉంటారో అలాగే ఆయ‌న కూడా మాసిపోయిన బ‌ట్ట‌ల‌తో కనిపించాడు.

salaar shoot updates

ఇక ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ప్రేక్ష‌కుల్లో నెల‌కొంది. ఇక అలాగే ప్ర‌భాస్ కూడా షూటింగ్స్‌ల‌తో తీరిక లేకుండా గడుపుతున్నాడు. Prabhas ప్ర‌భాస్ న‌టించిన రాధేశ్యామ్ చిత్రం షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకోగా.. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్ ఇవ్వ‌నున్నారు. మ‌రోవైపు నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్‌లో సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న మూవీలో, బాలీవుడ్ డైరెక్ట‌ర్ రూపొందిస్తున్న ఆదిపురుష్ చిత్రంలో Prabhas ప్ర‌భాస్ న‌టిస్తున్నాడు. కానీ మొద‌టి ప్రాధాన్య‌త స‌లార్ సినిమాకు ప్ర‌భాస్ ఇచ్చాడంటే ఈ సినిమాపై ఎంతో న‌మ్మ‌కంగా ఉన్నాడ‌నే అర్థం క‌దా.. అందుకేనేమో స‌లార్ చిత్రం కోసం మాసిపోయిన బ‌ట్ట‌ల‌తో క‌ష్ట‌ప‌డుతున్నాడు Prabhas ప్ర‌భాస్‌.