Prabhas: స‌లార్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన చిత్ర‌బృందం..

Prabhas: యంగ్ రెబెల్‌స్టార్ ప్ర‌భాస్, ప్రశాంత్‌నీల్ కాంబినేష‌న్‌లో స‌లార్ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయ‌నున్నారు. ఈ మూవీలో అండ‌ర్ వ‌రల్డ్ డాన్‌గా ప్ర‌భాస్ క‌నిపించ‌నున్నాడు. దీంతో ఈ చిత్రంపై ప్ర‌భాస్ అభిమానుల్లో ఓ రేంజ్‌లో ఉత్కంఠ నెల‌కొన్నాయి.. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం అప్‌డేట్స్ ఇస్తారు.. పోస్ట‌ర్ల్, టీజ‌ర్ ఎప్పుడు వ‌స్తుంది అని ఫ్యాన్స్ ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఈ చిత్రంకు సంబంధించి స‌రికొత్త అప్‌డేట్‌ను ప్ర‌క‌టించింది చిత్ర‌బృందం.

salaaar updates

2022లో స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 14న Prabhasస‌లార్ చిత్రం రిలీజ్ కానుంద‌ని ప్ర‌భాస్ పోస్ట‌ర్‌తో ప్ర‌క‌టించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా స‌లార్ తిరుగుబాటు.. 2022 ఏప్రిల్ 14న మేము వేడుక‌లు జ‌రుపుకోవ‌డానికి వేచి ఉండ‌లేం.. మీ అంద‌రితో అంటూ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్‌నీల్ ట్వీట్ చేశాడు. ఇక ఈPrabhas చిత్రాన్ని హోంబ‌లే ఫిల్మ్ బ్యాన‌ర్‌పై కిరంగ‌దూర్ నిర్మిస్తుండ‌గా.. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక ప్ర‌భాస్ వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయ‌న న‌టించిన రాధేశ్యామ్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఆదిపురుష్ చిత్రంలో Prabhasప్ర‌భాస్ న‌టిస్తున్నాడు. అలాగే టాలీవుడ్ ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ నాగ్అశ్విన్ తెర‌కెక్కించే సైన్స్ ఫిక్ష‌న్ చిత్రంలో ప్ర‌భాస్ Prabhasన‌టిస్తున్నాడు.